- Telugu News Photo Gallery Spiritual photos Guru Gochar on October 19th 2025: impact on these three zodiac signs get good luck
Guru Gochar: ఈ నెల 19 నుంచి ఈ రాశుల వారి వివాహంలో అడ్డంకుల నుంచి ఉపశమనం.. గురు అనుగ్రహం వీరి సొంతం
జ్యోతిష్యశాస్త్రంలో నవ గ్రహాలకు, రాశులకు, నక్షత్రాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తాయి. ఈ గ్రహ సంచారం సమయంలో మొత్తం 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. అక్టోబర్ నెలలో పలు ముఖ్యమైన గ్రహాలు సంచారం చేయనున్నాయి. ఈ నెల 19న దేవగురు బృహస్పతి తన రాశిని మర్చుకోనున్నాడు. దీంతో కొన్ని రాశులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి .విహహ ప్రయత్నాలు చేస్తున్నవారికి అడ్డంకులు తొలగి పెళ్లి కుదిరే అవకాశం ఉంది.
Updated on: Oct 04, 2025 | 10:14 AM

నవ గ్రహాల్లో ఒకటైన బృహస్పతి అక్టోబర్ 19, 2025న తన రాశిచక్రాన్ని మార్చుకోబోతున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం 12:57 గంటలకు కర్కాటకరాశిలోకి ప్రవేశించనున్నాడు. డిసెంబర్ 4 వరకు ఈ రాశిలో ఉండనున్నాడు. దీని తర్వాత.. దేవగురు బృహస్పతి డిసెంబర్ 4న రాత్రి 8:39 గంటలకు మిథునరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. జ్యోతిష్కశాస్త్రం ప్రకారం, బృహస్పతి ఈ కదలిక అత్యంత ముఖ్యమైన సంఘటనలలో ఒకటి. దేవ గురువు సంచారం వలన మొత్తం 12 రాశిచక్రాలపై అలాగే దేశం, ప్రపంచంపై విస్తృత ప్రభావం పడుతుంది.

బృహస్పతి కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు.. అంటే ఈ నెల 19వ తేదీ నుంచి మూడు రాశిచక్రాల వ్యక్తులు కెరీర్ పురోగతి, కళలో మెరుగుదల, పిల్లలతో ఆనందం, వివాహంలో అడ్డంకుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఈ మూడు రాశులకు చెందిన వ్యక్తుల పెండింగ్ పనులు పూర్తవుతాయి. విహహ ప్రయత్నాలు చేస్తున్నవారికి అడ్డంకులు తొలగి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. వీరు ప్రతి రంగంలోనూ కావలసిన ఫలితాలను సాధించే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ అదృష్ట రాశుల పేర్లను తెలుసుకుందాం.

వృషభ రాశి: ఈ రాశి వారికి బృహస్పతి రాశి మార్పు సానుకూల ఫలితాలను తెలుస్తుంది. వీరు తాము పెట్టిన పెట్టుబడులపై మంచి రాబడిని పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో సంతానం కోసం ఎదురుచుస్తున్నవారు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. ఈ సమయం వ్యాపారంలో సానుకూల మార్పులను తెస్తుంది. పనిపై విశ్వాసం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు మార్గంలో ఉన్న అడ్డంకుల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రత్యేకమైన వ్యక్తితో వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో పోటీ పరీక్షలు రాసే వారు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది.

సింహ రాశి: ఈ సమయం సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కెరీర్ సానుకూల మలుపు తీసుకుంటుంది. బృహస్పతి ప్రభావం ప్రతి రంగంలోనూ పురోగతికి ద్వారాలు తెరుస్తుంది. ప్రేమ వివాహం చేసుకోవలనుకునేవారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులు విద్యా రంగంలో మంచి విజయాన్ని పొందవచ్చు. అంతేకాదు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది భవిష్యత్తులో సంపదకు అవకాశం కల్పిస్తుంది. వీరు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని చూస్తున్నట్లయితే.. ఈ సమయం సువర్ణావకాశాలను అందిస్తుంది. ఆరోగ్యంలో కూడా మెరుగుదల కనిపిస్తుంది.

కుంభ రాశి: ఈ సమయం కుంభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలతో పాటు, మరొక వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తారు. అయితే బృహస్పతి ఆశీస్సులతో ప్రధాన పని కూడా విజయవంతమవుతుంది. బహుళ ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. వాహనం లేదా ఇల్లు కొనలనుకునేవారి కల నెరవేరుతుంది. తాము చేసే పనిలో మీ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరుస్తారు, ఇది పై అధికారులతో వీరి సంబంధాలను మెరుగుపరుస్తుంది. వీరు పిల్లల కెరీర్‌కు సంబంధించి సమస్యలను ఎదుర్కొంటుంటే.. వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.




