- Telugu News Photo Gallery Luck awaits those of five zodiac signs after Diwali with the blessings of Saturn and Venus
అదృష్టం అంటే వీరిదేరా బాబు.. దీపావళి తర్వాత లక్కే లక్కు!
దీపావళికి కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసిరానున్నది. ముఖ్యంగా గ్రహాల్లో ఎంతో శక్తివంతమైన శని, శుక్రగ్రహాలు కలిసి శక్తివంతమైన రాజయోగాన్ని ఏర్పాటు చేయనున్నాయి. దీని వలన ఐదు రాశుల వారికి అదష్టం కలిసి రానున్నది. ఈ సంవత్సరం అక్టోబర్ 20న దీపావళి పండగ జరగనుంది. దీంతో పండగ తర్వాత ఏ ఐదు రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుందో ఇప్పుడు చూద్దాం.
Updated on: Oct 04, 2025 | 12:28 AM

మకర రాశి : మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరి ఆర్థికంగా అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి అనేక లాభాలు వస్తుంటాయి. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటాబయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

వృషభ రాశి : శుక్ర, శని గ్రహాల ప్రభావంతో వృషభ రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి జాబ్ దొరికే ఛాన్స్ ఉంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగులు మంచి ప్రమోషన్ పొందుతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

మీన రాశి : మీన రాశి వారికి అనుకోని విధంగా ఆదాయం పుట్టుకొస్తుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. చాలా రోజుల నుంచి ఎవరైతే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారి కోరిక ఫలమిస్తుంది. విద్యార్థులు మంచి ర్యాంకులతో పాస్ అవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

తుల రాశి : తుల రాశి వారికి దీపావళి తర్వాత ఇంటిలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. అనుకోని విధంగా డబ్బు చేతికందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఎవరైతే చాలా కాలంగా స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. అదే విధంగా, సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

కుంభ రాశి : ఈ రాశి వారికి శుక్ర శని గ్రహాల ప్రభావంతో పట్టిందల్లా బంగారమే కానుంది. అనేక అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు, కొత్త ఆదాయ వనరులు పుట్టుకొస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.



