జాగ్రత్త.. మహిళలు అర్థరాత్రి వరకు మెలుకవతో ఉంటున్నారా?
నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ కంటి నిండా నిద్రపోవాలని చెబుతుంటారు. కానీ ఈ మధ్య చాలా మంది రాత్రి ఆలస్యంగా నిద్రపోతున్నారు. అయితే ఇలా లేట్ నైట్ నిద్రపోవడం వలన అనేక సమస్యలు దరిచేరే ప్రమాదం ఉన్నదంట. ముఖ్యంగా మహిళలు ఎక్కువ సేపు మేల్కోవడం చాలా ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Updated on: Oct 03, 2025 | 11:49 PM

నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ కంటి నిండా నిద్రపోవాలని చెబుతుంటారు. కానీ ఈ మధ్య చాలా మంది రాత్రి ఆలస్యంగా నిద్రపోతున్నారు. అయితే ఇలా లేట్ నైట్ నిద్రపోవడం వలన అనేక సమస్యలు దరిచేరే ప్రమాదం ఉన్నదంట. ముఖ్యంగా మహిళలు ఎక్కువ సేపు మేల్కోవడం చాలా ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ప్రస్తుతం చాలా మంది మహిళలు ఆలస్యంగా నిద్రపోతున్నారు. పని ఒత్తిడి కుటుంబ బాధ్యతల వలన నిద్ర పోవడం ఆలస్యం అవుతుంది. మహిళలు చాలా లేటుగా నిద్ర పోవడం వలన అనేక సమస్యలు వస్తాయంట. కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి సమయంలో ఎక్కువ సేపు మేల్కొనడం వలన మహిళల్లో మెలటోనిన్ లోపం సమస్య తలెత్తుతుందంట. దీని వలన మానిసిక స్థితి నియంత్రణ , రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయంట. అందుకే స్త్రీలు రాత్రి సమయంలో త్వరగా నిద్రపోవాలంటున్నారు వైద్య నిపుణులు.

పని ఒత్తిడి, నిద్ర సరిగ్గాలేకపోవడం వలన పీసీఓఎస్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నదంట. ముఖ్యంగా నిద్రలేమి సమస్యతో మెటిమలు, అధికంగా బరువు పెరగడం, వంద్యత్వం, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలు వస్తాయంట.

sleep