- Telugu News Photo Gallery They will be blessed with good fortune due to the Raja Yoga of Bhadra Mahapurusha
భద్ర మహాపురుష రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
గ్రహాల కలయిక వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే కొన్ని గ్రహాల కలయిక ఏర్పడ నుంది. ఈ గ్రహాల కలయిక వలన భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
Updated on: Oct 04, 2025 | 12:33 AM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఉండే ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్రహాలు కొన్ని సార్లు రాశులు లేదా నక్షత్ర సంచారం చేస్తుంటాయి. అయితే గ్రహా మండలంలోని గ్రహాలు కొన్ని సార్లు కలయిక జరుపుతాయి. అయితే ఈ సారి కొన్ని గ్రహాల కలయిక వలన అనేక రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడ నుంది. దీని వలన నాలుగు రాశుల వారికి ఆర్థికంగా, అదృష్ట పరంగా కలిసిరానున్నది.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి భద్ర మహాపురుష రాజయోగం వలన అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి. అంతే కాకుండా ఈ రాశి వారు చాలా లాభాలు పొందుతారు. ముఖ్యంగా, వ్యాపారంలో అనేక లాభాలు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అత్యధిక లాభాలు అందుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి భద్ర మహాపురుష రాజయోగం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశి వారు ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. ఆకస్మిక ధనల లాభం కలుగుతుంది. అలాగే చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

తుల రాశి : తులరాశి వారు అనుకోని ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులకు, రియలెస్టేరంగంలో ఉన్నవారికి అనేకే లాభాలు వస్తాయి. అంతే కాకుండా విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు సంపాదిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

మకర రాశి : మకర రాశి వారికి భద్ర మహాపురుష రాజయోగంతో అదృష్టం తలుపు తడుతుందని చెప్పాలి. ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్స్ అందుకుంటారు. అలాగే ఎవరైతే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటారో వారికి కూడా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చును.



