- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: five powerful alum remedies bring peace and prosperity at home
Vastu Tips: పటిక క్రిమి సంహరియే కాదు.. డబ్బు, శ్రేయస్సు కోసం పటికతో ఈ పరిహారాలు చేసి చూడండి..
వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం.. ఇంట్లోని వస్తువులు అమరిక వలన ఇంట్లో సానుకూలత నెలకొంటుంది. అయితే ప్రతికూల శక్తులను తొలగించడానికి సానుకూలతను పెంచడానికి పటిక ప్రభావవంతంగా ఉంటుంది. ఇల్లు, జీవితంలో శాంతిని కాపాడుకోవడానికి పటికతో నివారణలను చేసి.. పాజిటివ్ ఎనర్జీని సృష్టించుకోవచ్చు.
Updated on: Oct 04, 2025 | 11:52 AM

పటిక సాధారణంగా దాని క్రిమినాశక లక్షణాలతో ప్రసిద్ధి చెందింది. దీనిని నీటిని శుభ్రం చేయడానికి, గాయాలను శుభ్రపరచడం వంటి వాటికీ కూడా ఉపయోగిస్తారు. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్ర దృక్కోణంలో కూడా పటిక విశేషమైన ప్రాముఖ్యత ఉంది. పటిక అనేక సమస్యలను తగ్గించడంలో సహాయకారిగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో సానుకూలతను కొనసాగించాలనుకుంటే.. పటిక ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించబడింది. ఇంట్లో, జీవితంలో శాంతిని కాపాడుకోవడానికి పటికతో ఎలాంటి పరిహారాలు చేయవచ్చో ఈ రోజు తెలుసుకుందాం..

ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగించడానికి: పటిక పర్యావరణం నుంచి ప్రతికూల శక్తిని గ్రహించే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతిరోజూ నీటిలో కొద్దిగా పటికను కలిపి ఇంటిని తుడుచుకుంటే.. అది ఒత్తిడి, ఉద్రిక్తత, ప్రతికూలతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంట్లో శాంతి మరియు ఆనందాన్ని కాపాడుతుంది. ఈ చర్యతో సానుకూల శక్తి ప్రబలంగా ఉంటుంది.

వ్యాపార వృద్ధికి పరిష్కారం: వ్యాపారం అకస్మాత్తుగా క్షీణించినట్లయితే లేదా కస్టమర్ల రద్దీ తగ్గినట్లయితే.. ఒక నల్లటి వస్త్రంలో పటికను కట్టి.. వ్యాపార సంస్థ ప్రధాన ద్వారం వద్ద దీనిని వేలాడదీయండి. ఇది మీ వ్యాపారానికి శ్రేయస్సును పునరుద్ధరిస్తుందని.. చెడు దృష్టి ప్రభావాలను తగ్గిస్తుందని నమ్ముతారు.

పిల్లలకు భయంకరమైన కలలు వస్తే: పిల్లలకు రాత్రి సమయంలో భయానక కలలు వచ్చినా లేదా భయపడి మేల్కొన్నా.. మంగళవారం లేదా శనివారం రాత్రి పడుకునేటప్పుడు వారి మంచం దగ్గర 50 గ్రాముల పటికను ఉంచండి. ఇది పిల్లల నిద్రను మెరుగుపరుస్తుంది. భయం అనే భావనను తొలగిస్తుంది.

వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య తరచుగా తగాదాలు ఉంటే లేదా సంబంధంలో ఉద్రిక్తత పెరిగిమా.. నల్లటి వస్త్రంలో పటికను కట్టి మంచం కింద ఉంచండి. ఇలా చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య పరస్పర సంబంధాలు మెరుగుపడటం ప్రారంభమవుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

రుణ విముక్తికి పరిష్కారం: ఎవరైనా చాలా కాలంగా అప్పుల బాధలో ఉంటే.. బుధవారం నాడు పటిక ముక్కకు సింధూరం రాసి.. దానిని తమలపాకులో చుట్టి దారంతో కట్టండి. తరువాత సాయంత్రం దానిని రావి రాతి చెట్టు కింద పాతిపెట్టండి. ఈ పరిహారం అప్పుల నుంచి బయటపడే అవకాశాలను పెంచుతుంది.

ఆర్థిక సమస్యలకు పరిష్కారం: మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే పటిక కలిపిన నీటితో స్నానం చేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ పరిహారం ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. (ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)




