AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ పక్షుల అలవాట్లు నేర్చుకున్న మనిషి జీవితంలో.. అపజయం అన్న మాటే ఉండదు..

ఆచార్య చాణక్యుడు జీవితాన్ని సులభంగా జీవించడానికి అనేక మార్గాలు చెప్పారు. మనిషి నిరంతరం పోరాటం చేయాల్సి ఉంటుంది.. ఈ పోరాటాలు జీవితంలో కష్టాలను పూర్తిగా తొలగించక పోయినా.. కష్టాలను దాటేందుకు సులభమైన మార్గాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఏ మనిషి జీవితంలో పరిపూర్ణుడు కాడని.. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని మళ్ళీ ఆ తప్పులు చేయని మనిషి జీవితంలో సక్సెస్ అందుకుంటాడని చాణక్య చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం కొన్ని పక్షుల లక్షణాలు అలవరుచుకున్న మనిషి జీవితంలో విజయాన్ని సాధిస్తాడు. ఆ పక్షుల ఏమిటి? వాటి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి తెలుసుకుందాం..

Surya Kala
|

Updated on: Oct 04, 2025 | 12:56 PM

Share
ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తాయి. ఈ ఇబ్బందులకు భయపడి వెనక్కి తగ్గేవారు ఎప్పటికీ విజయాన్ని అందుకోలేరు. అయితే ఈ  సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తికి ఒడిలో విజయం చేరుతుంది. జీవితంలోని పోరాటాన్ని .. కష్టాలను పూర్తిగా తొలగించలేకపోయినా.. ఖచ్చితంగా వాటిని తక్కువగా, సులభతరం చేయవచ్చు. చాణక్య నీతి ప్రకారం కొన్ని పక్షుల గురించి తెలుసుకుందాం.. వీటిలోని కొన్ని లక్షణాలు నేర్చుకున్న మనిషి చాలా ఈజీగా సక్సెస్ ను అందుకుంటాడు.

1 / 6
కోడి పుంజు: ఎవరైనా తమ జీవితంలో విజయం సాధించాలనుకుంటే.. రోజును ముందుగానే ప్రారంభించే గుణాన్ని కోడి పుంజు నుంచి నేర్చుకోవాలి. ప్రతి మనిషి సూర్యోదయానికి ముందు మేల్కొనడం,  జీవిత సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడం వంటి లక్షణాలను కోడిపుంజు నుంచి నేర్చుకోవాలి. చాణక్యుడి ప్రకారం ఏ వ్యక్తికైనా విజయం సాధించడానికి ఈ లక్షణాలు చాలా అవసరం.

2 / 6
కాకి: కాకులు ఎప్పుడూ ఒంటరిగా తమ ఆహారాన్ని సేకరిస్తాయి. ఎప్పుడూ సోమరితనంతో ఉండవు. ఎవరినీ సులభంగా నమ్మవు. విజయం సాధించాలంటే.. ప్రతి మానవుడు కాకి నుంచి ఈ గుణాన్ని నేర్చుకోవాలి. తమ లక్ష్యం వైపు కదులుతున్నప్పుడు.. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ సులభంగా నమ్మకూడదు.

3 / 6

కొంగ: హెరాన్ ప్రత్యేకత ఏమిటంటే.. దీనికి తన ఇంద్రియాలన్నింటినీ ఎలా నియంత్రించుకోవాలో తెలుసు. చాణక్యుడి ప్రకారం.. నిగ్రహం విజయానికి మొదటి మెట్టు. ప్రతి వ్యక్తి కొంగలా తమ ఇంద్రియాలను నియంత్రించుకునే నైపుణ్యాన్ని నేర్చుకోవాలి. దీనిని సాధించిన వ్యక్తి ప్రశాంతమైన మనస్సు కలిగి ఉంటాడు. తన లక్ష్యం నుంచి ఎప్పుడూ తప్పుకోడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఏకాగ్రతతో ముందుకు సాగుతాడు. ఇది వారి విజయ అవకాశాలను పెంచుతుంది.

4 / 6
కోకిల: నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని సామెత. కేవలం మాటలతో.. ఒక అపరిచితుడిని కూడా తన సొంతం వారిగా చేసుకోవచ్చు. తమ ప్రియమైన వారిని అపరిచితులుగా మార్చగలడు. కోకిలకి ఉన్న మధురమైన స్వరాన్ని ప్రజలు ఇష్టపడతారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ కోకిలలోని మాట మధురం అనే గుణాన్ని పెంపొందించుకోవాలి. ఎదుటి వ్యక్తి గురించి మంచిగా మాట్లాడలేకపోతే.. మౌనంగా ఉండండి. వారి గురించి ఇతరుల దగ్గర చెడుగా మాట్లాడవద్దు. చాణక్యుడి ప్రకారం ప్రతి ఒక్కరూ మధురమైన స్వరం ఉన్న వ్యక్తుల వైపు ఆకర్షితులవుతారు, ఇది భవిష్యత్తులో విజయానికి మార్గం సుగమం చేస్తుంది.

5 / 6

6 / 6