Yama Deepam: ఈ రోజు ధన త్రయోదశి.. సాయంత్రం యమ దీపాన్ని ఎలా వెలిగించాలి? ఏ దిశలో వెలిగించాలో తెలుసా..
ధన త్రయోదశి పండగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం లక్ష్మి కుబేరుల పూజకు రెడీ అవుతున్నారు. అంతేకాదు ఈ రోజున వెలిగించే యమ దీపానికి కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ధన్ తేరస్ నాడు వెలిగించే యమ దీపం ప్రాముఖ్యతను పద్మ పురాణం, స్కంద పురాణంలో వివరించబడింది.ఈ రోజున ప్రదోష కాలంలో యమ దీపం వెలిగించడం వల్ల అకాల మరణ భయం తొలగిపోతుంది.

ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణం పక్షం పదమూడవ రోజున ధన్ తేరస్ పండుగ జరుపుకుంటారు. నేడు దేశం మొత్తం ధన్ తేరస్ జరుపుకుంటుంది. సముద్ర చిలికినప్పుడు ఈ రోజున ధన్వంతరి చేతిలో అమృత భాండంతో ఉద్భవించాడు. అప్పటి నుంచి ఈ రోజున ధన్ తేరస్ జరుపుకుంటున్నారు. ఈ రోజున ధన్వవంతరి తో పాటు లక్ష్మీదేవి, కుబేరుడిని పూజిస్తారు.
ధన త్రయోదశి రోజున వీరిని పూజించడం వల్ల ఇంట్లోని దుఃఖం, దారిద్య్రం తొలగిపోతాయి. ఈ రోజున యమునికి కూడా దీపం వెలిగిస్తారు. ఈ రోజున వెలిగించే యమ దీపం ప్రాముఖ్యతను పద్మ పురాణం, స్కంద పురాణంలో వివరించబడింది. ధన త్రయోదశి రోజున ప్రదోష కాలంలో యమునికి దీపం వెలిగించడం వల్ల అకాల మరణ భయం తొలగిపోతుందని నమ్మకం. ఈ నేపధ్యంలో ఈ రోజు యమ దీపం వెలిగించడానికి శుభ సమయం ఏమిటి? ఏ దిశలో వెలిగించాలి తెలుసుకుందాం.
ఈ రోజు ధన్‌తేరాస్ .. కృష్ణ పక్ష త్రయోదశి తిథి (చీకటి పక్షం) ఈరోజు మధ్యాహ్నం 12:18 గంటలకు ప్రారంభమైంది. ఈ తిథి రేపు అక్టోబర్ 19న, మధ్యాహ్నం 1:51 గంటలకు కొనసాగుతుంది.
యమ దీపం వెలిగించడానికి మంచి సమయం యమ దీపం వెలిగించే శుభ సమయం సాయంత్రం 5:48 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ శుభ సమయం సాయంత్రం 7:04 గంటల వరకు ఉంది. ఈ రోజు యమ దీపం వెలిగించడానికి ప్రజలకు 1 గంట 16 నిమిషాల శుభ సమయం ఉంటుంది. ఈ సమయంలో ప్రజలు యమ దీపం వెలిగించవచ్చు.
యమ దీపం వెలిగించే విధానం
నాలుగు వైపుల దీపం వెలిగించే విధంగా ఉన్న ఒక మట్టి ప్రమిదను తీసుకొని.. దానిని నీటితో కడిగి ఆరబెట్టండి. ఈరోజు సాయంత్రం 5:48 గంటలకు ఈ దీపాని నువ్వుల నూనెతో నింపి యమధర్మ రాజు అనుగ్రహం కోసం వెలిగించండి. మట్టి ప్రమిదలో నాలుగు వైపుల నాలుగు వత్తులు ఉంచండి. “మృత్యునా పాశదండాభ్యాం కాలేన శ్యామయా సః |త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజః ప్రియతాం మమ్” ఈ మంత్రాన్ని చదువుతూ దీపం వెలిగించండి.
యమ దీపం వెలిగించే దిశ మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద దక్షిణం వైపు ముఖంగా ఈ దీపం వెలిగించండి. ఈ దిశను యమ ధర్మ రాజు దిశగా భావిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








