- Telugu News Photo Gallery Spiritual photos Salt Vastu Tips: Boost Home Energy and Attract Prosperity
Vastu Tips: ఇంట్లో ఉప్పును ఉంచడానికి వాస్తు నియమాలున్నాయని తెలుసా? ఏ దిశలో? ఏ పాత్రలో నిల్వ చేయాలంటే..
వాస్తు, జ్యోతిషశాస్త్రంలో రాతి ఉప్పుకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఉప్పు శని గ్రహంతో ముడిపడి ఉందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. కనుక ఉప్పు ఇల్లు, జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపే శక్తి మూలకంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం చుట్టుపక్కల శక్తిని సమతుల్యం చేయడానికి ఉప్పును సరైన స్థలం, దిశలో నిల్వ చేయడం చాలా అవసరం.
Updated on: Oct 18, 2025 | 1:21 PM

హిందూ సంస్కృతిలో ప్రతి వస్తువుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని భావిస్తారు. ముఖ్యంగా అది ఆహారంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు. అలాంటి వాటిలో ఉప్పు ఒకటి. ఇది ఆహారానికి రుచిని ఇచ్చే వస్తువు మాత్రమే కాదు జీవితంలో సమతుల్యతను కాపాడుకునే అంశంగా కూడా పరిగణించబడుతుంది. ఉప్పు సానుకూలత, సమతుల్యతకు చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది.

వాస్తు శాస్త్రం , జ్యోతిషశాస్త్రంలో ఉప్పును శక్తితో ముడిపడి ఉన్న ఒక మూలకంగా వర్ణించారు. ఇది ఇల్లు, జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఉప్పును ప్రతికూల శక్తులను తొలగించడానికి, సానుకూల శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు.

వాస్తు ప్రకారం ఇంట్లో ఉప్పు నీటితో నేల తుడుచుకోవడం, మూలల్లో ఉప్పు గిన్నెలు పెట్టడం, ప్రధాన ద్వారం వద్ద ఉప్పు మూట వేలాడదీయడం వంటివి చేస్తారు.వాస్తు ప్రకారం ఉప్పును సరైన స్థలంలో దిశలో ఉంచడం ముఖ్యం. అప్పుడే ఉప్పు చుట్టుపక్కల శక్తిని సమతుల్యం చేస్తుంది.

జ్యోతిషశాస్త్రంలో ఉప్పు చంద్రుడు, శనితో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. సరిగ్గా నిల్వ చేస్తే అది ఇంట్లో శుభ శక్తి స్థిరమైన ప్రవాహాన్ని నిర్వహిస్తుంది. ఉప్పును ఎల్లప్పుడూ గాజు, సిరామిక్ లేదా ఉక్కు మూత ఉన్న పాత్రలో నిల్వ చేయాలని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఇంటికి ఆనందం , శ్రేయస్సు వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అయితే ఇనుము లేదా అల్యూమినియం పాత్రలలో ఉప్పును నిల్వ చేయడం వల్ల దురదృష్టకరమైన ప్రభావం ఉంటుంది. ఇది ఉద్రిక్తత, సంఘర్షణ , ఆర్థిక నష్టానికి దారితీస్తుంది.

మత విశ్వాసాల ప్రకారం వంటగదిలో ఉప్పు నిల్వ చేసే దిశ కూడా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఆగ్నేయ దిశలో (అగ్ని కోణం) నిల్వ చేయడం శుభప్రదమని నిపుణులు అంటున్నారు. ఈ ప్రదేశంలో ఉప్పు ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం కాపాడుతుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.

అయితే ఉప్పుని నిల్వ చేసే విషయంలో కూడా తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. తెరిచి ఉన్న పాత్రలో ఉప్పు నిల్వ చేయడం వల్ల ప్రతికూల శక్తి ఆకర్షిస్తుందని చెబుతారు. దీని ఫలితంగా కుటుంబ కలహాలు, విడిపోవడం , ఆర్థిక సంక్షోభం ఏర్పడతాయి.

ఎల్లప్పుడూ శుభ్రమైన, మూత ఉన్న పాత్రలో ఉప్పును నిల్వ చేయాలి. ఉప్పు లక్ష్మీ దేవి ఆశీర్వాదాలను సూచిస్తుందని ..దానిని సరిగ్గా నిల్వ చేయడం వల్ల ఇంట్లో సంపద,శ్రేయస్సు పెరుగుతుందని గ్రంథాలు చెబుతున్నాయి.

ఉప్పు కేవలం రుచినిచ్చే పదార్థం మాత్రమే కాదు..జీవిత దిశ, స్థితిని ప్రభావితం చేసే శక్తి కూడా దీనికి ఉంది. సరైన స్థలంలో లేదా కంటైనర్‌లో నిల్వ చేస్తే అది ఇంట్లో శాంతి, శ్రేయస్సు , సామరస్యాన్ని కాపాడుతుంది. అయితే నిర్లక్ష్యంగా నిల్వ చేసిన ఉప్పు ప్రతికూల పరిస్థితులను సృష్టించగలదు.




