AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాలుని ఎక్కలేక తిప్పలు పడుతున్న గున్న ఏనుగు.. కవచంగా మారిన తల్లి ఏనుగు..

ఏనుగుకి సంబంధించిన ఏ వీడియోలు అయినా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అవుతాయి. కొన్ని వీడియోలు నవ్విస్తే... మరికొన్ని హృదయాన్ని తాకుతాయి. అటువంటి హృదయాన్ని కదిలించే వీడియో వైరల్ అవుతోంది. ఏనుగు పిల్లకి సంబంధించిన ఒక వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీన్ని చూసిన తర్వాత తల్లి ప్రేమ అందరికీ ఒకటే అని మీరు అర్థం చేసుకుంటారు. అది మానవులైనా, జంతువులైనా సరే. ఈ వీడియో చూసిన తరవాత అందరూ ఆశ్చర్యపోయారు.

వాలుని ఎక్కలేక తిప్పలు పడుతున్న గున్న ఏనుగు.. కవచంగా మారిన తల్లి ఏనుగు..
Elephant Video Viral
Surya Kala
|

Updated on: Oct 18, 2025 | 12:51 PM

Share

తల్లి హృదయం ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. అది మనిషి అయినా..జంతువు అయినా. తన బిడ్డకు కష్టం వస్తే కవచంగా మారుతుంది. బిడ్డ పడిపోయినప్పుడు.. ఎత్తుకోవడానికి ముందుగా పరుగెత్తేది తల్లి. దీనిని రుజువు చేసే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. గున్న ఏనుగు, దాని తల్లికి మధ్య ఉన్న అనురాగం ప్రజల హృదయాలను తాకుతోంది. IFS అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. “ప్రతి జాతిలో తల్లులు ఒకటే” అనే శీర్షికని జత చేశారు.

ఈ చిన్న వీడియో ఎవరి హృదయాన్నైనా కరిగించే తల్లి ప్రేమ, ఆప్యాయతల సంగ్రహావలోకనాన్ని చూపిస్తుంది. వీడియోలో ఏనుగుల గుంపు అడవి మధ్యలో ఉన్న రహదారి వైపు కదులుతున్నట్లు కనిపిస్తుంది. దారిలో ఒక వాలు ఉంది..వాలు మీద నుంచి నడిచి రోడ్డు ఎకాల్సి ఉంది. ఇది పెద్ద ఏనుగులకు సులభం.. అయితే చిన్న ఏనుగు పిల్లకు.. వాలు ఎక్కడం అంటే ఒక పర్వతం ఎక్కడం అన్నమాట. గున్న ఏనుగు వాలు మీద నుంచి పైకి ఎక్కేందుకు చాలాసార్లు ప్రయత్నించింది.కానీ ప్రతిసారీ జారి పడిపోయింది.

ఇవి కూడా చదవండి

సృస్తిలో తల్లిని మించి కవచం లేదు తన పిల్ల పడుతున్న కష్టం చూసిన తల్లి ఏనుగు వెంటనే ఆగిపోయింది. తన బిడ్డ వైపు తిరిగి తన తొండంతో దాన్ని పైకి నెట్టడానికి ప్రయత్నిస్తుంది. కొన్నిసార్లు దానిని తన కాళ్ళతో కిందకు జారిపోకుండా చేస్తూ.. దానిని మెల్లగా వాలు మీదుగా నడిపించింది. తల్లి ఏనుగు.. తన పిల్ల పట్ల చూపించిన ఆప్యాయతను స్పష్టంగా తెలుస్తుంది. చింతించకు నేను నీతో ఉన్నాను” అని చెబుతున్నట్లు అనిపిస్తుంది.

ఇది మాత్రమే కాదు సమీపంలో నిలబడి ఉన్న మరో పెద్ద ఏనుగు ఈ దృశ్యాన్ని చూసి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. అది కూడా తన తొండంతో ఆ బిడ్డను పైకి లాగడానికి ప్రయత్నించాడు. ఆ రెండు పెద్దల సహాయంతో.. గున్న ఏనుగు పైకి ఎక్కగలుగుతుంది. ఒకసారి పైకి చేరుకున్న తర్వాత.. అది తన తల్లి వద్దకు పరిగెత్తింది. రెండూ కలిసి రోడ్డు దాటాయి. ఈ దృశ్యం చాలా భావోద్వేగంగా ఉంది. ఇది చూపరులకు చిరునవ్వు తెస్తుంది.

వీడియోను ఇక్కడ చూడండి

ఈ వీడియో సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే.. స్పందనలు వెల్లువెత్తాయి. ఈ చిన్న వీడియో తల్లి బంధం భాష లేదా జాతులకు అతీతమైనదని ప్రజలకు గుర్తు చేసింది. మానవుడు, పక్షి లేదా జంతువు.. ఒక తల్లి ఎల్లప్పుడూ తన బిడ్డకి కష్టం వస్తే ఆ బిడ్డకు అండగా మొదటగా నిలబడుతుంది. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా.. ఆమె ఎల్లప్పుడూ తన బిడ్డ భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందని కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ విడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..