AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali : దీపావళికి రుచికరమైన ఆరోగ్యకరమైన గులాబ్ జామున్ ని ఇంట్లోనే చేసుకోండి.. రెసిపీ ఏమిటంటే..

దీపావళి పండగ అంటేనే స్వీట్స్ గుర్తుకొస్తాయి. మార్కెట్ లో కొనుగోలు చేద్దామంటే.. ఖరీదు ఎక్కువ, పైగా వాటి నాణ్యత పై అనుమానం.. కనుక దీపావళి రోజున దేవుడికి, అతిధులకు ఇంట్లోని సభ్యల కోసం రుచికరమైన గులాబ్ జామున్ లను తయారు చేసుకోవచ్చు. తక్కువ టైం లో తక్కువ పదార్ధాలతో కిలో కంటే ఎక్కువ గులాబ్ జామున్‌లను తయారు చేసుకోవచ్చు. ఒక వారం వరకు నిల్వ చేయవచ్చు.

Diwali : దీపావళికి రుచికరమైన ఆరోగ్యకరమైన గులాబ్ జామున్ ని ఇంట్లోనే చేసుకోండి.. రెసిపీ ఏమిటంటే..
Gulab Jamun
Surya Kala
|

Updated on: Oct 18, 2025 | 11:13 AM

Share

దీపావళి లాంటి పండుగ అంటేనే స్వీట్ల గుర్తుకొస్తాయి. మార్కెట్‌లోని స్వీట్ షాపుల్లో రకరకాల స్వీట్స్ సందడి చస్తాయి. అయితే పండుగల సమయంలో కల్తీ స్వీట్లు కూడా తరచుగా అమ్ముతారు. డబ్బుని ఆదా చేసుకోవడానికి.. ఆరోగ్యం కోసం కేవలం ఇంట్లోనే గులాబ్ జామున్ లను చేసుకోవచ్చు. 250 గ్రాముల మావా దీనినే ఖోయా, కోవా అని కూడా అంటారు. ఈ కోవాని ఉపయోగించి ఇంట్లో 40 కంటే ఎక్కువ గులాబ్ జామున్‌లను సులభంగా తయారు చేసుకోవచ్చు. దీపావళికి గులాబ్ జామున్‌లను తయారు చేసే రెసిపీ గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు

కోవా – 250 గ్రాములు

మైదా పిండి- 4 చెంచాల

ఇవి కూడా చదవండి

పనీర్ – ఒక కప్పు

చక్కెర – 3 కప్పులు

నీరు -రెండున్నర కప్పులు

బేకింగ్ పౌడర్- చిన్న చెంచా

యాలకుల పొడి- ఒక స్పూన్

రోజ్ వాటర్ – రెండు స్పూన్లు

కుంకుమ పువ్వు రేకలు- 6

నూనె – వేయించడానికి సరిపడా

గులాబ్ జామున్ కోసం సిరప్ ఎలా తయారు చేయాలి?

ముందుగా చక్కెర సిరప్ ని చేసుకోవాలి. ఒక పాన్‌ తీసుకుని 3 కప్పుల చక్కెర వేయండి. రెండున్నర కప్పుల నీరు జోడించండి. కొన్ని కుంకుమపువ్వు రేకలు వేసి గ్యాస్ మంటను మీడియం నుంచి హై వరకు మారుస్తూ ..మధ్య మద్యలో కదిలిస్తూ ఉండండి. చక్కెర పూర్తిగా కరిగి త్వరగా నీరు మరగడం మొదలు పెట్టిన తర్వాత 2 నిమిషాలు ఉడికించండి. అంతే సిరప్ రెడీ. దీని తర్వాత గ్యాస్ మంటను ఆపివేయండి. అందులో యాలకుల పొడి, రోజ్ వాటర్ జోడించండి. దీంతో సిరప్ రెడీ అయినట్లే.. దీనిని పక్కన పెట్టండి.

గులాబ్ జామున్ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలంటే

గులాబ్ జామున్ పిండిని తయారు చేయడానికి 250 గ్రాముల కోవా తీసుకోవాలి. సాధారణ పనీర్ ని తీసుకోవాలి లేదా గులాబ్ జామున్ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన హరియాలి పన్నీర్ ని తీసుకున్నా బాగుంటుంది. దీన్ని అరచేతితో గుజ్జు చేసుకోవాలి. మావాను 7 నుంచి 8 నిమిషాలు పిసికి కలుపుకోవాలి. మిక్సర్‌లో వేసి మెత్తగా చేయాలి. ఇప్పుడు టిష్యూ పేపర్ ఉపయోగించి పనీర్‌లోని అదనపు తేమను తొలగించండి. దానిని గ్రేడింగ్ చేసి మావాతో కలపండి. మావా, పనీర్ రెండూ సిల్కీగా మరెలా కలుపుకోవాలి.

ఇప్పుడు 4 చెంచాల మైదా పిండి తీసుకుని అందులో ఒక చిన్న చెంచా బేకింగ్ పౌడర్ వేసి కలపండి. ఈ పిండిని జల్లెడ పట్టుకుని ఈ పిండి మిశ్రమంలో పనీర్, మావా మిశ్రమం పిండి వేసి కలపండి. బాగా కలిపిన తర్వాత ఈ పిండి మిశ్రమంపై తడి గుడ్డలో కప్పి 10 నిమిషాలు ఉంచండి. దీని తర్వాత ఆ పిండిని తీసి మళ్ళీ పిసికి కలుపుకోండి. గులాబ్ జామున్ చేయడానికి మీకు షేప్స్ లో చిన్న బంతిలా చుట్టుకొండి.

స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి చేయండి.. మరీ వేడిగా ఉండకూడదు. తరువాత ఆ నూనె లో గులాబ్ జామున్లను ఒక్కొక్కటిగా వేస్తూ అవి అంటుకోకుండా ఉండటానికి ఒక చెంచాతో నూనె తిప్పుతూ ఉండండి. చక్కెర సిరప్ కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి. గులాబ్ జామున్లు బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి. తరువాత వాటిని తీసి సిరప్‌లో ఉంచండి. ఇలా మొత్తం గులాబ్ జామున్ లన్నీ వేయించుకుని సిరప్ లో వేసుకోవాలి. వాటిని 2 నుంచి 3 గంటలు అలాగే ఉంచండి. తర్వాత పిస్తా పప్పులతో అలంకరించి గులాబ్ జామున్ల ను సర్వ్ చేయండి. వీటిని రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకుంటే ఒక వారం వరకు నిల్వ చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి
ఏంటీ ఎప్పుడూ జుట్టు అతిగా రాలిపోతుందా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే!
ఏంటీ ఎప్పుడూ జుట్టు అతిగా రాలిపోతుందా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే!