AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut : ప్రతిరోజూ పరగడుపున పచ్చికొబ్బరి తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే…

మారుతున్న వాతావరణానికి అనుగుణంగా శరీరానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. కొబ్బరిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలు అంటువ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తుంది. పచ్చి కొబ్బరి శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది. పరగడుపునే పచ్చి కొబ్బరి తినటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Coconut : ప్రతిరోజూ పరగడుపున పచ్చికొబ్బరి తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే...
Raw Coconut
Jyothi Gadda
|

Updated on: Oct 18, 2025 | 1:32 PM

Share

కొబ్బరి నీళ్లు, కొబ్బరి కాయ, పచ్చికొబ్బరి, వంటకాలకు వాడే ఎండుకొబ్బరిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. కానీ, కొబ్బరిలోని పోషకాలు మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ముఖ్యంగా పచ్చికొబ్బరిని ప్రతి రోజూ ఉదయాన్నే తీసుకుంటే బాడీకి ఎన్నో పోషకాలు అందుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా శరీరానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. కొబ్బరిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలు అంటువ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తుంది. పచ్చి కొబ్బరి శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది. పరగడుపునే పచ్చి కొబ్బరి తినటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఖాళీ కడుపుతో పచ్చి కొబ్బరి తినడం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

కొబ్బరిలో రాగి, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు.. ఇందులో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, ఐరన్, మాంగనీస్, కాపర్‌లు ఉన్నాయి. ఖాళీ కడుపుతో పచ్చి కొబ్బరి తింటే జీర్ణ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకానికి చక్కటి పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పచ్చి కొబ్బరిలో ఉండే ఫైబర్, ఆమ్లాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. పచ్చి కొబ్బరి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

పచ్చి కొబ్బరిలో ఉండే కొవ్వులు చర్మానికి పోషణ అందించి, చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు చర్మ సమస్యలకు చెక్ పెడుతాయి. కొబ్బరిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. చర్మాన్ని మృదువుగా, కోమలంగా చేస్తుంది. కొబ్బరిలోని పోషకాలు ముఖ్యంగా ప్రోటీన్, ఐరన్ జుట్టుని పొడుగ్గా పెరిగేలా చేస్తుంది. దీంతో జుట్టు షైనీగా మారుతుంది. దీని వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా దృఢంగా పెరిగేలా చేస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ సీనియర్ నటి మనవరాలు ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే?
ఈ సీనియర్ నటి మనవరాలు ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే?
రైలులో ట్రాన్స్‌జెండర్‌ ముందు ఏడ్చిన యువకుడు..ఆమె చేసిన పనికి..
రైలులో ట్రాన్స్‌జెండర్‌ ముందు ఏడ్చిన యువకుడు..ఆమె చేసిన పనికి..
Chanakya Niti: ఈ రెండు గుణాలుంటే మీరు జీవితంలో ఓడిపోరు!
Chanakya Niti: ఈ రెండు గుణాలుంటే మీరు జీవితంలో ఓడిపోరు!
వీరికి నిమ్మకాయ విషంతో సమానం.. దూరం పెట్టకపోతే నేరుగా అక్కడికే..
వీరికి నిమ్మకాయ విషంతో సమానం.. దూరం పెట్టకపోతే నేరుగా అక్కడికే..
సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!
సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే