Eggs: రోజుకు ఎన్ని గుడ్లు తినాలి.. ఎక్కువ తింటే ఏమవుతుందో తెలుసా..?
గుడ్లు పోషకాల భాండాగారం అనడంలో సందేహం లేదు. ప్రోటీన్, ఖనిజాలు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నప్పటికీ.. చాలామంది కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భయంతో గుడ్లను తమ ఆహారం నుండి దూరంగా ఉంచుతున్నారు. మరికొందరు పచ్చసొనను మాత్రమే వదిలివేస్తూ తెల్లసొన తింటారు. అయితే ఆరోగ్యకరమైన ఆహారంలో గుడ్లను ఎంతవరకు చేర్చుకోవాలి. ఎవరు జాగ్రత్తలు పాటించాలి వంటి వివరాలను తెలుసుకుందాం..
Updated on: Oct 18, 2025 | 1:13 PM

Eggs

పోషకాహార నిపుణురాలు షాలిని సుధాకర్ అభిప్రాయం ప్రకారం.. గుడ్ల విషయంలో ప్రజలు చేసే అతిపెద్ద తప్పులు రెండు.. ఎక్కువగా తినడం లేదా తప్పుడు పద్ధతిలో వండుకోవడం. ఈ తప్పుల వల్ల గుడ్లలోని పోషకాలు కోల్పోతారు. అలాగే అకస్మాత్తుగా గుడ్లను పూర్తిగా మానేయడం కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

గుండె జబ్బులు ఉన్నవారు కూడా గుడ్లు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. గుడ్లు తినటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. దీంతో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా హార్ట్‌ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.

గుడ్లను పోషకాహారానికి సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. వీటిలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కొవ్వు ఉండదు. పచ్చసొనలో విటమిన్లు A, D, E, K, B12, అలాగే ఇనుము, జింక్, భాస్వరం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి.

గుడ్లు శరీరానికి మేలు చేస్తాయి. అయితే వాటిని తీసుకునే పద్ధతి, పరిమాణంపై దృష్టి పెట్టడం ముఖ్యం. పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన వ్యక్తులలో అది రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా పెంచదు. అందువల్ల మీరు ఆరోగ్యంగా ఉంటే, పచ్చసొనతో సహా గుడ్లను ఆస్వాదించండి.




