AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చూడటానికి సింపుల్‌గానే ఉంది.. కానీ రేటు మాత్రం లక్షల్లో.. ప్రియాంక డ్రస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ప్రియాంక చోప్రా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.. మిస్ వరల్డ్ టైటిల్ ను గెలుచుకుని మోడలింగ్ నుంచి నటిగా బాలీవుడ్ లో అడుగు పెట్టి.. ఇప్పుడు హాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా ది బ్లఫ్ అనే చిత్రం ప్రమోషన్‌లో బిజీ బిజీగా ఉంది.

చూడటానికి సింపుల్‌గానే ఉంది.. కానీ రేటు మాత్రం లక్షల్లో.. ప్రియాంక డ్రస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Priyanka Chopra
Rajeev Rayala
|

Updated on: Feb 23, 2026 | 8:44 AM

Share

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అందం గురించి ,స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడి స్టైల్ కు బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతుంటారు. వింత వింత డ్రస్ లతో హొయలు ఒలక బోసే ప్రియాంక చోప్రా ఇటీవల ఓ వెరైటీ డ్రస్ తో అందరికి షాక్ ఇచ్చింది. రీసెంట్ గా ప్రియాంక సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పంచుకుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ సుందరి. రెగ్యులర్ గా తన ఫొటోలతో పాటు ఫ్యామిలీ ఫోటోలను కూడా పంచుకుంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ప్రియాంక మరోసారి నెటిజన్స్ ను కట్టిపడేసింది. అయితే ఈఅమ్మడు వేసుకున్న ఓ డ్రస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చమశనీయంగా మారింది.

ప్రియాంక ప్రస్తుతం ది బ్లఫ్ మూవీలో నటిస్తుంది. ఈ సినిమాలో హాలీవుడ్ లో తెరకెక్కింది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గడిపేస్తుంది ప్రియాంక. తాజాగా ది బ్లఫ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొంది ఈ సుందరి. ఈ ప్రెస్ మీట్ లో డిఫరెంట్ డ్రస్ లో మెరిసింది. ధోతీ-స్టైల్‌ లో ఉంది ఆ డ్రస్. చూడానికి సింపుల్ గానే ఉంది కానీ దాని ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

ఈ డ్రస్ ను జిమ్మెర్మాన్ బ్రాండ్  తయారు చేసిందని తెలుస్తుంది. కాగా లూనా డ్రేప్డ్ హరేమ్ ప్యాంట్స్ ధర రూ. 1.43 లక్షలు, కోఆర్డినేటింగ్ సిల్క్ శాటిన్ షిఫాన్ టాప్ ధర రూ.77వేలు. మొత్తంగా ఈ డ్రస్ ధర సుమారు రూ. 2.20 లక్షలు అని తెలుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్రియాంక పోస్ట్ పై ఆమె డ్రస్ పై పలువురు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ప్రియాంక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us