AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోల్డ్‌ లోన్‌ vs పర్సనల్‌ లోన్‌.. ఏది తీసుకుంటే మంచిది? నిపుణుల సూచన ఇదే!

అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ మధ్య ఏది ఎంచుకోవాలో చాలామందికి సందేహం ఉంటుంది. తక్కువ వడ్డీతో, త్వరగా రుణం కావాలంటే బంగారం అందుబాటులో ఉంటే గోల్డ్ లోన్ మేలు. బంగారం తాకట్టు పెట్టలేని వారికి, ఎక్కువ వడ్డీ అయినా పర్వాలేదనుకుంటే పర్సనల్ లోన్ సరైనది.

గోల్డ్‌ లోన్‌ vs పర్సనల్‌ లోన్‌.. ఏది తీసుకుంటే మంచిది? నిపుణుల సూచన ఇదే!
Gold Loan, Personal Loan
SN Pasha
|

Updated on: Feb 23, 2026 | 8:30 AM

Share

ఎమర్జెన్సీగా డబ్బు అవసరం వచ్చినప్పుడు గోల్డ్ లోన్ తీసుకోవాలా? లేదా పర్సనల్ లోన్ తీసుకోవాలా? అనే డౌట్‌ చాలామందిలో కనిపిస్తోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ లోన్‌ తీసుకోవాలి అనేది వ్యక్తిగత పరిస్థితులు, అవసరాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గోల్డ్ లోన్ విషయంలో ప్రధాన ప్రయోజనం తక్కువ వడ్డీ రేటు. బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం వల్ల బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తక్కువ రిస్క్‌గా భావిస్తాయి. అందువల్ల పర్సనల్ లోన్‌తో పోలిస్తే వడ్డీ సాధారణంగా తక్కువగా ఉంటుంది. అదనంగా గోల్డ్ లోన్ త్వరగా మంజూరు అవుతుంది, క్రెడిట్ స్కోర్ ప్రభావం తక్కువగా ఉంటుంది. అత్యవసరంగా తక్కువ ఖర్చుతో డబ్బు అవసరమైనప్పుడు ఇది అనుకూలంగా ఉంటుంది. అయితే బంగారం తాకట్టు పెట్టాల్సి ఉండటం ప్రధాన లోపంగా నిపుణులు చెబుతున్నారు. చెల్లింపులు ఆలస్యమైతే బంగారం వేలం వేయబడే ప్రమాదం ఉంటుంది.

మరోవైపు పర్సనల్ లోన్ పూర్తిగా అన్‌సెక్యూర్డ్ రుణం. ఎలాంటి తాకట్టు అవసరం లేకుండా బ్యాంకులు మంజూరు చేస్తాయి. అందువల్ల బంగారం లేదా ఆస్తి లేకున్నా తీసుకోవచ్చు. వినియోగంలో కూడా పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కానీ దీనిపై వడ్డీ రేటు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ బలంగా లేకపోతే రుణం మంజూరు కావడం కష్టమవుతుంది లేదా వడ్డీ మరింత పెరుగుతుంది.

నిపుణుల సూచన ప్రకారం, తక్కువ వడ్డీతో త్వరగా రుణం కావాలనుకునే వారు, బంగారం అందుబాటులో ఉన్న వారు గోల్డ్ లోన్ వైపు మొగ్గు చూపవచ్చు. అయితే తాకట్టు పెట్టడానికి బంగారం లేకపోతే లేదా ఆస్తిని రిస్క్‌లో పెట్టాలనిపించకపోతే పర్సనల్ లోన్ సరైన ఎంపిక అవుతుంది. మొత్తంగా అవసరం, తిరిగి చెల్లించే సామర్థ్యం, వడ్డీ భారం వంటి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. పరీక్షలైన వెంటనే టెన్త్ రిజల్ట్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. పరీక్షలైన వెంటనే టెన్త్ రిజల్ట్
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..
ఓరీ దేవుడో తినేటప్పుడు మళ్లీ ఉప్పు చల్లుకుని తింటే ఇంత డేంజరా?
ఓరీ దేవుడో తినేటప్పుడు మళ్లీ ఉప్పు చల్లుకుని తింటే ఇంత డేంజరా?
తలసి పూజ చేసేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
తలసి పూజ చేసేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..