AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nita Ambani: రోజూ రూ.50 లక్షల వాటర్ తాగుతున్న నీతా అంబానీ? వైరల్ ఫొటో వెనుక అసలు నిజం ఇదే!

Nita Ambani Water: ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్‌లో నీళ్లు తాగుతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ బాటిల్ ధర అక్షరాలా రూ.50 లక్షలు. ఇంతకీ ఈ వార్తలో నిజమెంత? ఆ వాటర్ ప్రత్యేకతలేంటి?

Nita Ambani: రోజూ రూ.50 లక్షల వాటర్ తాగుతున్న నీతా అంబానీ? వైరల్ ఫొటో వెనుక అసలు నిజం ఇదే!
Nita Ambani
Subhash Goud
|

Updated on: Nov 03, 2026 | 3:25 PM

Share

Nita Ambani Water: మనం సాధారణంగా బయటకు వెళ్ళినప్పుడు రూ.10 లేదా రూ.20 పెట్టి ఒక వాటర్ బాటిల్ కొంటాము. విలాసవంతమైన హోటళ్ళు రూ.100 వరకు వసూలు చేయవచ్చు. కానీ ఈ ప్రత్యేకమైన వాటర్ బాటిల్ ఖరీదు ఏకంగా $60,000. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.50 లక్షలకు సమానం. కానీ ఒక వాటర్ బాటిల్ ధర ఏకంగా రూ.50 లక్షలు ఉంటే ఆశ్చర్యపోవాల్సిందే.

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఇలాంటి ఖరీదైన నీటినే తాగుతారంటూ కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నీతా అంబానీ చేతిలో గోల్డ్‌ కలర్‌లో వాటర్ బాటిల్‌తో కనిపించే ఫొటో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు.

ప్రపంచంలోనే ఖరీదైన వాటర్ బాటిల్

ఈ ప్రచారంలో కనిపిస్తున్న బాటిల్ పేరు ‘Acqua di Cristallo Tributo a Modigliani’. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ప్రత్యేక బాటిల్‌ను డిజైనర్ ఫెర్నాండో అల్టామిరానో రూపొందించారు. ఇటాలియన్ కళాకారుడు అమేడియో మొడిగ్లియాని కళాఖండాల స్ఫూర్తితో దీనికి ప్రత్యేకమైన డిజైన్‌ను అందించారు. ఈ వాటర్‌ బాటిల్‌పై 24 క్యారెట్ల బంగారంతో ప్రత్యేకమైన డిజైన్ ఉంటుంది.

2010లో మెక్సికోలో జరిగిన వేలంలో ఈ బాటిల్ సుమారు 60,000 అమెరికన్ డాలర్లకు అమ్ముడైంది. అప్పటి మారకపు విలువ ప్రకారం భారత కరెన్సీలో సుమారు రూ.44 లక్షలకు పైగా ఉంటుంది. ప్రస్తుతం మారకపు విలువను బట్టి దీని ధర రూ.50 లక్షలకు దగ్గరగా ఉండవచ్చు. ఈ రికార్డును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా గుర్తించింది.

Nita Ambani Water

Nita Ambani Water

ఈ నీటిలో బంగారం కూడా కలుపుతారా?

ఈ బాటిల్ గురించి మరో ఆసక్తికరమైన విషయం ఉంది. తయారీదారుల వివరాల ప్రకారం ఇందులో ఫిజీ, ఫ్రాన్స్ ప్రాంతాల సహజ నీటితో పాటు ఐస్‌లాండ్‌కు చెందిన గ్లేసియర్ నీటిని మిళితం చేస్తారు. అంతేకాదు, ఈ నీటిలో 24 క్యారెట్ల బంగారానికి సంబంధించిన సూక్ష్మ కణాలు కలుపుతారని ప్రచారం కూడా ఉంది. కొన్ని కథనాల్లో 5 మిల్లీగ్రాముల బంగారు రేణువులని పేర్కొన్నారు. అయితే ఈ నీరు తాగడం వల్ల చర్మం మెరుగుపడుతుందని, శరీరానికి అదనపు శక్తి వస్తుందని చేసే ప్రచారానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.

నీతా అంబానీ ఫొటోలో అసలు జరిగింది ఇదే

ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. నీతా అంబానీ నిజంగానే ఈ రూ.50 లక్షల వాటర్ బాటిల్ ఉపయోగిస్తున్నారా? అనే ప్రశ్నకు నివేదికలు మాత్రం ఇది ఫేకే అని చెబుతున్నాయి. 2015 ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా నీతా అంబానీ నీళ్లు తాగుతున్న ఫొటోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఆ ఫొటోలో ఆమె చేతిలో ఉన్నది సాధారణ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మాత్రమే. ఆ తర్వాత కొందరు ఫొటోను ఎడిట్ చేసి, ఆమె చేతిలోని సాధారణ బాటిల్ స్థానంలో బంగారు రంగులో ఉన్న ఖరీదైన Acqua di Cristallo బాటిల్‌ను జోడించారు. ఈ మార్ఫింగ్ ఫొటోనే సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేశారు.

Nita Ambani Water Bottle

Nita Ambani Water Bottle

2021లో BOOM, The Quint కంపెనీలు ఈ ఫొటోపై ఫ్యాక్ట్‌చెక్ నిర్వహించాయి. వైరల్ ఫొటో ఎడిట్ చేసినదేనని, నీతా అంబానీ ఆ ఖరీదైన వాటర్ బాటిల్ ఉపయోగిస్తున్నారనే దానికి ఆధారాలు లేవని వెల్లడించాయి.

ప్రచారంలో నిజం ఏంటి?

ప్రపంచంలో రూ.45–50 లక్షల విలువైన ప్రత్యేక వాటర్ బాటిల్ ఉండటం నిజమే. దానిని వేలంలో సుమారు 60,000 డాలర్లకు విక్రయించడం కూడా వాస్తవమే. కానీ నీతా అంబానీ ప్రతిరోజూ అదే నీటిని తాగుతారనే ప్రచారానికి ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు లేవు. కాబట్టి సోషల్ మీడియాలో కనిపించే ఫొటోలను చూసి వెంటనే నమ్మకూడదు. ముఖ్యంగా ప్రముఖులకు సంబంధించిన వైరల్ ఫొటోల వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకున్న తర్వాతే వాటిని ఇతరులకు షేర్ చేయడం మంచిది.

Nita Ambani Water

Nita Ambani Water

Follow Us