ఇంటి కింద సొరంగం.. అందులో ఐదు రహస్య గదులు..! ఒక్కొటి ఒక్కో అద్భుతం..!!
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల.. అందుకోసం నిరంతరంగా శ్రమిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది రెడీమేడ్ ఇళ్లను కొనుగోలు చేస్తుంటారు. బయటి నుండి చూస్తే ఆ ఇంటి గురించి తమకు అన్నీ తెలుసని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు అలాంటి ఇళ్లలో దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటపడతాయి. అలాంటిది జరిగినప్పుడు వారు ఆశ్చర్యపోతారు.

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల.. అందుకోసం నిరంతరంగా శ్రమిస్తూ ఉంటారు. ప్రస్తుతం అపార్ట్ మెంట్ కల్చర్ బాగా పెరిగింది. పైగా నగరాలు, పట్టణాల్లో కావాల్సినంత స్థలం లేకపోవడంతో ప్రజలు ఎక్కువగా అపార్ట్‌మెంట్లలోనే ఉండాల్సి వస్తంఉది. అలాగే, శివరు ప్రాంతాలు, సిటీకి దూరంగా అనేక విల్లాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇకపోతే, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది రెడీమేడ్ ఇళ్లను కొనుగోలు చేస్తుంటారు. బయటి నుండి చూస్తే ఆ ఇంటి గురించి తమకు అన్నీ తెలుసని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు అలాంటి ఇళ్లలో దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటపడతాయి. అలాంటిది జరిగినప్పుడు వారు ఆశ్చర్యపోతారు.
ఒక వ్యక్తికి సరిగ్గా ఇదే జరిగింది. అతను తన సొంత ఇంటి కింద సొరంగాలు, రహస్య గదులను గుర్తించాడు. చాలా కాలం వరకు అతనికి తన ఇంటి కింద ఇలాంటి నిర్మాణం ఉందని తెలియదు. ఈ భయంకరమైన వాస్తవం అతన్ని ఒక్కసారిగా కుంగదీసింది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
సోషల్ మీడియా రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన ఈ వార్త వైరల్‌గా మారింది. బాధిత వ్యక్తి తన ఇంటి కింద కనుగొన్న సొరంగాలు, రహస్య గదుల ఫోటోలను షేర్ చేశాడు. అతను ఇలా వివరించాడు.. అక్కడ చాలా షీట్లు పడి ఉండవచ్చు, బహుశా రక్తంతో తడిసి ఉండవచ్చు. సొరంగాలు కొనసాగుతూనే ఉంటాయి.. బహుశా ఐదు గదులు ఉండొచ్చునని చెప్పాడు. కొన్ని గదుల్లో విద్యుత్ ఉంటుంది. మరికొన్నింటిలో నీరు ప్రవహిస్తుందని చెప్పాడు.
కొంతకాలం భూగర్భ ప్రాంతాన్ని గాలిస్తూ వెళ్లిన తర్వాత అతనికి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిందని ఆయన వివరించాడు.. ఇది సంవత్సరాల తరబడి బూజు, నిలిచిపోయిన నీరు పేరుకుపోయిందని చెప్పాడు. అక్కడి వాతావరణం, పరిస్థితిని మీరు ఊహించలేరని చెప్పాడు. ఎందుకంటే.. అక్కడ చాలా భయానకంగా ఉందని చెప్పాడు. ఈ వింత ఆవిష్కరణపై సోషల్ మీడియా వినియోగదారులు చాలా మంది వ్యాఖ్యానించారు. చాలా మంది దీనిని 2022 భయానక చిత్రం బార్బేరియన్ తో పోల్చారు. ఇక్కడ ఒక అమ్మాయి తన అద్దె ఇంటి నేలమాళిగలో ప్రమాదకరమైన గదికి దారితీసే రహస్య మార్గాన్ని కనుగొంటుంది.
found a network of tunnels and rooms under my house byu/Visible_Sale4845 increepy
ఒక యూజర్ ఆ పోస్ట్ పై స్పందిస్తూ..ఫన్నీ కామెంట్ చేశారు. హాలోవీన్ వస్తోంది మిత్రమా. దీన్ని ఒక హాంటెడ్ హౌస్‌గా మార్చండి అని రాశాడు.. ఒక్కొక్కరికి దాదాపు 1500 నుండి 2000 రూపాయలు వసూలు చేయండి. రెండు నెలలు ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచండి. మిగిలిన సంవత్సరం ఆపరేట్ చేయవద్దు అంటూ మరికొందరు సలహా ఇచ్చారు. చాలా మంది దానిని పూర్తిగా శుభ్రం చేయాలని సలహా ఇస్తూ మీరు ఈ స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేసి పెద్ద బార్ లాంటిది లేదంటే హ్యాంగ్అవుట్ స్పాట్‌గా మార్చుకోవచ్చునని సూచించారు.
ఈ సెల్ వెనుక ఉన్న కారణం చాలా మందికి అర్థం కాలేదు. చాలా మంది ఇంటిని వెంటనే ఖాళీ చేయాలని సలహా ఇస్తున్నారు. ఇది పాత బొగ్గు సెల్లార్ కావచ్చునని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. గదిలో లైటింగ్, రీన్ఫోర్స్డ్ పైకప్పులు ఉన్నాయని, ఇల్లు గతంలో హైడ్రోనిక్ తాపనను ఉపయోగించిందని కూడా వారు గుర్తించారు. అయితే, ఇంటి కింద ఈ వింతైన సొరంగ మార్గం ఎందుకు నిర్మించబడింది. షీట్లపై ఉన్న మరకలు వాస్తవానికి ఏమిటి అనే దానిపై రహస్యం మిగిలి ఉంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




