AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం ధర తెలిస్తే దడే..! ఒక్కరోజులో ఎంత పెరిగిందో చూస్తే గుండెలు గుభేల్..! రూ. 2 లక్షలు దాటిన వెండి

పసిడి పరుగులు తీస్తోంది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందనంత ఎత్తుకు ఎగబాకుతోంది. మార్కెట్ ఒడిదుడుకులు పెట్టుబడిదారుల ఆసక్తి మేరకు గోల్డ్‌ రేట్స్ పెరుగుతుంటే.. తానేం తక్కువ అన్నట్లు వెండి సైతం దూసుకెళ్తోంది. ఇది ఈ సంవత్సరంలో ఇప్పటివరకు బంగారం కంటే ఎక్కువ దూసుకెళ్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వెండి ధర కేజీ రూ. 2 లక్షల మార్కు దాటడం ఇదే తొలిసారి.

బంగారం ధర తెలిస్తే దడే..! ఒక్కరోజులో ఎంత పెరిగిందో చూస్తే గుండెలు గుభేల్..!  రూ. 2 లక్షలు దాటిన వెండి
Gold Silver Rate
Jyothi Gadda
|

Updated on: Oct 18, 2025 | 7:17 AM

Share

ఈ 2025 సంవత్సరంలో పసిడి ధరలకు రెక్కలొచ్చాయి.. అవును.. ఎందుకు ఎప్పుడూ లేనంతగా ఈ యేడు బంగారం ధరలు వేగంగా పెరిగిపోతున్నాయి. ఒక్కరోజు ఏదో వందల్లో తగ్గితే.. ఆ మార్నాటికే వేలల్లో పైకి లేస్తుంది బంగారం ధర. సామాన్య మధ్యతరగతి ప్రజలు కనీసం గోల్డ్‌ వైపు కన్నెత్తి చూడాలన్న కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అంతర్జాతీయ మార్కె ట్లో ధరలు భారీగా పెరగడంతోపాటు దేశీయంగా జ్యువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్‌ కూడా దీనికి కారణమని ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ పేర్కొంది. ఈ క్రమంలోనే సరిగ్గా ప్రజలందరీ పండగ సెంటిమెంట్‌ ధంతేరాస్ వేడుకకు ఒక్కరోజు ముందు పసిడి ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. బంగారం ధర భారీగా పెరిగింది. ఇవాళ హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

– ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,930 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,860 ఉంది. ఇక, 18 క్యారెట్ల ధర రూ.97,210

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,710 ఉంది. ఇక 18 క్యారెట్ల ధర రూ. 99,590

– విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,710 ఉంది. ఇక 18 క్యారెట్ల ధర రూ. 99,590

– విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,710 ఉంది. ఇక 18 క్యారెట్ల ధర రూ. 99,590

– ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,780 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,710 ఉంది. ఇక 18 క్యారెట్ల ధర రూ.99,590

– పూణేలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,780 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,710 ఉంది. ఇక 18 క్యారెట్ల ధర రూ.99,590

– కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,780, ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,710 ఉంది. ఇక 18క్యారెట్ల ధర రూ.99,590

– చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,100 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,010 ఉంది. ఇక 18 క్యారెట్ల ధర రూ. 1,01,010

– బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,780 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,710 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల ధర రూ.99,590లుగా ఉంది.

– కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,780 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,710 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల ధర రూ.99,590లుగా ఉంది.

ఇక వెండి విషయానికి వస్తే దేశంలో పసిడి ధరలతో పాటుగా వెండి కూడా పరుగులు పెడుతోంది. భారతదేశంలో ఇవాళ్టి వెండి ధర గ్రాము రూ.202.90లుగా ఉంది. అదే కిలో వెండి ధర పరిశీలిస్తే..కిలో రూ2,02,900లు వద్ద కొనసాగుతోంది.

ఇకపోతే, ఈ ధరలు ఈ ఉదయం 9గంటల లోపుగా అందిన సమాచారం మేరకు మాత్రమే అందించబడ్డాయి. మార్కెట్ మొదలయ్యే సమయానికి ఈ ధరలు మారిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..