AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఇకపై 36 నెలలు ఆగాల్సిందే.. పీఎఫ్‌లో మారిన ఈ రూల్స్ గురించి తెలుసా..?

ఉద్యోగుల కోసం ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు జాబ్ పోయినా, పీఎఫ్ డబ్బులు తీసుకోవడం చాలా ఈజీ అయింది. జాబ్ లేకపోతే పీఎఫ్ డబ్బుల్లో 75శాతం వరకు వెంటనే తీసుకోవచ్చు, మిగిలిన 25శాతం ఒక సంవత్సరం తర్వాత తీసుకోవచ్చు. అయితే పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి మాత్రం 36 నెలలు ఆగాల్సి ఉంటుంది.

EPFO: ఇకపై 36 నెలలు ఆగాల్సిందే.. పీఎఫ్‌లో మారిన ఈ రూల్స్ గురించి తెలుసా..?
Epfo Allows 75percent Pf Withdrawal
Krishna S
|

Updated on: Oct 18, 2025 | 11:29 AM

Share

ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరో గుడ్ న్యూస్ తెలిపింది. పీఎఫ్ విషయంలో కీలక మార్పులు చేసింది. ఈ రూల్స్ మనీ విత్ డ్రాను మరింత ఈజీగా మార్చనున్నాయి. జాబ్ కోల్పోయిన ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తికి ఉద్యోగం పోయి, ఖాళీగా ఉంటే, వాళ్ళు తమ పీఎఫ్ డబ్బుల్లో 75శాతం వరకు వెంటనే తీసేసుకోవచ్చు. ఇంకా ఉద్యోగం దొరకకపోతే మిగిలిన 25శాతం డబ్బును ఒక సంవత్సరం తర్వాత తీసుకోవడానికి అవకాశం ఉంది.

పెన్షన్ డబ్బులకు కొత్త వెయిటింగ్

ఇక్కడ నిరాశ కలిగించే విషయం ఏంటంటే.. జాబ్ పోయిన తర్వాత మీ పెన్షన్ స్కీమ్ డబ్బులు తీసుకోవాలంటే ఇకపై కేవలం 2 నెలలు కాదు.. ఏకంగా 36 నెలలు ఆగాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మీకు లేదా మీ కుటుంబానికి పెన్షన్ ప్రయోజనాలు దక్కేలా చూసేందుకే ఈ మార్పు అని ప్రభుత్వం చెబుతోంది. ఆర్థిక భద్రతను ప్రోత్సహించాలనేదే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.

ఉద్యోగం మారితే ఏం చేయాలి..?

ఉద్యోగం మారేటప్పుడు పీఎఫ్ విషయంలో పాటించాల్సిన సింపుల్ రూల్స్:

ఇవి కూడా చదవండి

ట్రాన్స్‌ఫర్ చేయడం: మీరు కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు పాత పీఎఫ్ ఖాతాను అలాగే వదిలేయకుండా, వెంటనే కొత్త ఖాతాకు బదిలీ చేయండి.

ఎలా బదిలీ చేయాలి?: మీ UAN నంబర్ ఉపయోగించి EPFO వెబ్‌సైట్‌లో సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

బదిలీ చేస్తే లాభం: ఇలా బదిలీ చేస్తే, మీ పాత సర్వీస్ అంతా కంటిన్యూ అవుతుంది. అప్పుడు మీకు పన్ను మినహాయింపులు ఉంటాయి. మీ డబ్బు పెరుగుతూనే ఉంటుంది.

PF ఖాతాను ఎప్పుడూ మర్చిపోవద్దు!

మీ పీఎఫ్ ఖాతాను ఎక్కువ కాలం పట్టించుకోకపోతే ఇబ్బందులు వస్తాయి:

వడ్డీ పోతుంది: చాలా కాలం అట్లాగే ఉంటే ఆ ఖాతాకు వడ్డీ రావడం ఆగిపోవచ్చు.

డబ్బు తీసుకోవడం కష్టం: మీ బ్యాంక్ వివరాలు, ఫోన్ నంబర్ లేదా కేవైసీ పాతవైపోతే తర్వాత డబ్బులు తీసుకోవడానికి లేదా క్లెయిమ్ చేయడానికి చాలా కష్టమవుతుంది.

ఇలా చేయండి: మీరు ఉద్యోగాలు మారినప్పుడు పీఎఫ్ ఖాతాను బదిలీ చేయండి లేదా ఖాళీగా ఉన్నప్పుడు డబ్బును తీసుకోండి. మీ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..