AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: ఇలా చేస్తే 5 ఏళ్లలో మీ చేతికి రూ.35 లక్షలు.. పోస్టాఫీస్‌లో ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?

మీరు ప్రతి నెలా కేవలం రూ.100తో ఈ స్కీమ్ స్టార్ట్ చేయవచ్చు. ఈ పథకంలో పెట్టుబడితో 5 ఏళ్లలో ఏకంగా రూ.35 లక్షలు మీ చేతికి వస్తాయి. ప్రభుత్వ భద్రత, స్థిరమైన వడ్డీతో.. మీ డబ్బు డబుల్ అవుతుంది. ఈ పోస్ట్ ఆఫీస్ సీక్రెట్ స్కీమ్ ఏమిటీ..? ఎలా పెట్టుబడి పెట్టాలి..? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Post Office: ఇలా చేస్తే 5 ఏళ్లలో మీ చేతికి రూ.35 లక్షలు.. పోస్టాఫీస్‌లో ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?
Post Office Recurring Deposit Scheme
Krishna S
|

Updated on: Oct 17, 2025 | 3:05 PM

Share

మీరు తక్కువ రిస్క్‌తో మీ సంపదను ఎక్కువ చేసుకోవాలనుకుంటున్నారా..? ప్రతి నెలా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి అధిక ఆదాయాన్ని పొందాలనుకుంటున్నారా..? అయితే ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం మీకు బెస్ట్ ఆప్షన్. ఈ పథకంలో పెట్టుండి పెడితే కేవలం 5 ఏళ్లలోనే లక్షల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది.

చిన్న మొత్తంతో ప్రారంభం..

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో మీరు కేవలం రూ.100తో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయవచ్చు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేకుండా మీరు చిన్న నెలవారీ వాయిదాలు చెల్లించడం ద్వారా మంచి ఆదాయన్ని పొందవచ్చు. అందుకే ఈ పథకం సాధారణ ప్రజలకు, పొదుపు చేయాలనుకునే వారికి గొప్ప ఆప్షన్‌గా నిలుస్తోంది.

5 ఏళ్లలో రూ.35 లక్షలు ఎలా..?

ఈ పథకం ద్వారా గణనీయమైన రాబడిని సులభంగా పొందవచ్చు. ఉదాహరణకు మీరు పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో ప్రతి నెలా రూ. 50,000పెట్టుబడి పెడితే, మీరు 5ఏళ్లలో మొత్తం రూ. 30 లక్షలు డిపాజిట్ చేస్తారు. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల ప్రకారం.. వడ్డీతో కలిపి మీ మొత్తం రూ. 35 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చేరుకునే అవకాశం ఉంది.

పూర్తిగా సురక్షితమైన పెట్టుబడి

ఈ పథకం యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. ఇది భారత ప్రభుత్వం మద్దతుతో నడుస్తుంది కాబట్టి పూర్తిగా సురక్షితం. స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్ల మాదిరిగా కాకుండా పోస్ట్ ఆఫీస్ RD హెచ్చుతగ్గులకు గురికాదు. మీ డబ్బుపై వడ్డీ కూడా స్థిరంగా ఉంటుంది. ఇది మీ పెట్టుబడికి పూర్తి భద్రతను ఇస్తుంది. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి ఇది ఉత్తమమైన ఎంపిక.

లోన్ – పన్ను ప్రయోజనాలు

అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైనప్పుడు.. ఏడాది తర్వాత తర్వాత మీ డిపాజిట్‌లో 50శాతం వరకు రుణం తీసుకునే సౌకర్యం కూడా ఈ పథకంలో ఉంది. ఇది మీ అకౌంట్‌ను మూసివేయకుండానే మీకు డబ్బును అందిస్తుంది. అదనంగా ఈ పోస్టాఫీస్ పథకం కింద సెక్షన్ 80C ప్రకారం మీరు రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. సురక్షితమైన పెట్టుబడి, మంచి రాబడితో పాటు పన్ను ఆదాను కూడా అందిస్తుంది ఈ పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం.

మీరు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా తక్కువ రిస్క్‌తో మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలంటే, ఈ పోస్ట్ ఆఫీస్ RD స్కీమ్ ఖచ్చితంగా బాగుంటుంది. ప్రస్తుత వడ్డీ రేట్లు, పన్ను నిబంధనలు మార్పులకు లోబడి ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.