Bank Holidays: బ్యాంకులకు తాళాలు.. ఈ రోజుల్లో వెళ్తే మీకు షాక్ తప్పదు.. ఇవి తెలుసుకోండి..
వచ్చే వారం అంతా పండుగే.. దీపావళి సందర్భంగా అక్టోబర్ 18 నుండి 23 వరకు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ సెలవులు అందరికీ ఒకేలా లేవు. మీ నగరాన్ని బట్టి, ఆ రోజు సెలవు ఉందో లేదో తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో బ్యాంకులు ఎప్పుడు తెరిచి ఉంటాయి..? అనేది తెలుసుకుందాం..

దేశవ్యాప్తంగా దీపావళి సందడి మొదలైంది. పండగ సందర్భంగా అన్ని ఆఫీసులు, స్కూళ్లు, బ్యాంకులు మూతపడతాయి.దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 23 వరకు బ్యాంకులకు వరుస సెలవులు ఉంటాయి. బ్యాంకులు ఏదైన పని ఉంటే ప్రత్యామ్నాయ రోజుల్లో వెళ్లడం మంచిది. అయితరే ఈ సెలవులు ప్రాంతాన్ని బట్టి మారుతాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఎప్పుడు ఉంటాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
అక్టోబర్ 18 – ధంతేరస్
దీపావళి పండుగ మొదటి రోజున ధంతేరస్ సందర్భంగా గౌహతి వంటి నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, జైపూర్ వంటి ఇతర ప్రధాన నగరాలలో బ్యాంకులు తెరిచే ఉంటాయి.
అక్టోబర్ 19 – ఆదివారం
ఈ రోజు సాధారణ ఆదివారం సెలవు కాబట్టి, దేశంలోని అన్ని బ్యాంకులు బంద్ ఉంటాయి.
అక్టోబర్ 20 (సోమవారం) – దీపావళి, లక్ష్మీ పూజ
దీపావళి పండుగ యొక్క ప్రధాన రోజు సందర్భంగా దేశంలోని అత్యధిక నగరాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, అగర్తల, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, తిరువనంతపురం వంటి నగరాల్లో బ్యాంకులు క్లోజ్ ఉంటాయి. కేవలం బేలాపూర్, భువనేశ్వర్, ఇంఫాల్, జమ్మూ, ముంబై, నాగ్‌పూర్, శ్రీనగర్ వంటి కొన్ని నగరాల్లో మాత్రమే బ్యాంకులు తెరిచి ఉంటాయి.
అక్టోబర్ 21 (మంగళవారం) – అమావాస్య, దీపావళి రెండో రోజు
ఈ రోజున ముంబై, నాగ్‌పూర్, భోపాల్, భువనేశ్వర్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, జమ్మూ, శ్రీనగర్, బేలాపూర్ వంటి నగరాల్లో బ్యాంకులకు సెలవు. అయితే ఈ రోజు హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, జైపూర్, విజయవాడ, మిగిలిన అనేక నగరాల్లో బ్యాంకులు తెరిచే ఉంటాయి.
అక్టోబర్ 22 (బుధవారం) – గోవర్ధన పూజ/అన్నకూట్
ఈ రోజు గోవర్ధన పూజ, గుజరాతీ నూతన సంవత్సరం. ప్రధానంగా అహ్మదాబాద్, ముంబై, నాగ్‌పూర్, జైపూర్, లక్నో, కాన్పూర్, డెహ్రాడూన్, బేలాపూర్ వంటి నగరాలలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. మిగిలిన నగరాల్లో బ్యాంకులు సాధారణంగా తెరుచుకుంటాయి.
అక్టోబర్ 23 (గురువారం) – భాయ్ దూజ్
సోదర సోదరీమణుల బంధాన్ని జరుపుకునే భాయ్ దూజ్ పండుగ సందర్భంగా అహ్మదాబాద్, కోల్‌కతా, ఇంఫాల్, లక్నో, కాన్పూర్, సిమ్లా వంటి నగరాలలో బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి. ఆర్బీఐ జాబితా ప్రకారం మిగిలిన నగరాల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయి.
బ్యాంకు సెలవు రోజులలో కూడా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ATM సేవలు యధావిధిగా అందుబాటులో ఉంటాయి. మీ బ్యాంకు లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా బెటర్.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




