- Telugu News Photo Gallery Check Gold and Silver rate ahead of Dhanteras festival, Latest Gold and Silver price in Hyderabad
Gold and Silver Price: ధంతేరాస్ ముందు పండుగలాంటి వార్త.. ఏకంగా రూ.3000 వేలు తగ్గిన ధర.. కేజీ ఎంతంటే?
ధంతేరాస్‌కు మందు జనాలకు బంగారం భారీ షాక్ ఇవ్వగా. వెండి మాత్రం పండగలాంటి వార్త చెప్పింది. సరిగ్గా రేపు ధంతేరాస్ అనుంగా బంగారం ధరలు బగ్గుమన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఒక్క రోజులో బంగారం ధర భారీగా రూ. 3,300 పెరిగగా, వెండి మాత్రం రూ.3000 తగ్గి సమాన్యులకు ఊరటనిచ్చింది. కాబట్టి దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
Updated on: Oct 17, 2025 | 1:37 PM

ధంతేరాస్ రోజు బంగారం, వెండి కొనాలని చాలా మంది అనుకుంటారు. కానీ వారికి సరిగ్గా ఒక్క రోజు ముందు బంగారం భారీ షాక్ ఇవ్వగా వెండి మాత్రం ఊరట నిచ్చింది. మునుపెన్నడూ లేని విధంగా బంగారం ధర ఒక్క రోజులో రూ. 3,300 పెరిగి రికార్డులు బద్దలు కొట్టంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ. 1,32,770 కి చేరుకుంది.

బంగారం రేటు పెరగడంతో చాలా మంది మధ్య తరగతి వారు వెండి కొనాలని చూస్తున్నారు. అలాంటి వారికి ఇది శుభవార్తగానే చెప్పవచ్చు. ఎందుకంటే ధంతేరాస్‌కు ముందు రోజు వెండి ధర భారీగా తగ్గింది. కేజీపై ఏకంగా రూ.3000 వేలు తగ్గి ప్రస్తుతం దేశీయ మార్గెట్‌లో వెండి ధర రూ.2,03,000గా కొనసాగుతుంది.

ఇక హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి కొస్తే..అక్టోబర్ 17 మధ్యాహ్నం సమయానికి స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై ఏకంగా రూ.3,330 పెరిగి రూ.1,29,440 నుంచి రూ.1,32,770కి చేరుకుంది.ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,050 పెరిగి రూ.1,18,650 నుంచి రూ.1,21,700కి చేరుకుంది.

ఇక హైదరాబాద్‌లో వెండి ధరల విషయానికి కొస్తే అక్టోబర్ 17 మధ్యాహ్నం సమయానికి కిలో వెండిపై రూ.3,000 తగ్గి ధర రూ.2,03,000కి చేరుకుంది.

ఇక విజయవాడ, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, పూణె నగరాల్లో బంగారం, వెండి ధరలు ఒకేలా కొనసాగుతుండగా..చెన్నైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,33,090 గా కొనసాగుతుంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,32,920గా కొనసాగుతుంది.




