- Telugu News Photo Gallery Spiritual photos Gold Rings Astrology: Which Finger to Wear for Luck and spritual Benefits
Gold Ring Astro Tips: బంగారం ఉంగరాలు అంటే ఇష్టమా.. ఏ వేలుకు ధరిస్తే ఎలాంటి ప్రయోజనాలో తెలుసా..
బంగారం పూర్వ కాలం నుంచి సంపద, శ్రేయస్సు , అదృష్టంతో ముడిపడి ఉంది.ఈ విలువైన లోహానికి ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత ఉంది. బంగారు ఆభరణాలు ధరించే విషయంలోనే కాదు.. బంగారు ఉంగరాలు ధరించే విషయంలో కూడా నియమాలున్నాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. అయితే ఇప్పుడు చాలా మంది వ్యక్తులు నమ్మకం, విశ్వాసాల కంటే ఫ్యాషన్, వ్యక్తిగత శైలి ఆధారంగా వేలును ఎంచుకుంటున్నారు.. కానీ ఒక నిర్దిష్టమైనవేలికి బంగారు ఉంగరం ధరించడం వల్ల అదృష్టం, సానుకూల శక్తిని ఆకర్షించే సామర్థ్యం పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు ఎవరు ఏ వేలికి ధరించాలి? తెలుసుకుందాం..
Updated on: Oct 17, 2025 | 10:41 AM

బంగారాన్ని అందరూ ఇష్టపడతారు. బంగారు ఆభరణాలు మహిళలకు మాత్రమే కాదు.. పురుషులకు కూడా ఇష్టమైన వస్తువులే. కొంతమంది అందం, విలాసం, అదృష్టం కోసం బంగారాన్ని ధరిస్తారు. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బంగారు ఆభరణాలను ఇష్టపడతారు. సాధారణంగా బంగారం ఆధ్యాత్మిక శక్తులను ఆకర్షించే, దుష్టశక్తులను తరిమికొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. చాలా మంది బంగారు ఆభరణాలను ఇష్టపడతారు.

హిందువులు బంగారాన్ని లక్ష్మీదేవి అంశంగా భావిస్తారు. అందుకే ప్రతి శుభ సందర్భాలలో బంగారం ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. బంగారం అందరికీ ఇష్టమైన ఆభరణం అయినప్పటికీ.. బంగారు నగలు అందరికీ సరిపోతాయో లేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. బంగారు నగలు చాలా మందికి అదృష్టాన్ని తెస్తాయి.. అదే సమయంలో కొంతమందికి బంగారం ధరించడం సమస్యలను కలిగిస్తుంది.

బంగారం కంటే ఎంత ఖరీదైన రాళ్ళు , లోహాలు ఉన్నా.. నేటికీ బంగారం డిమాండ్ తగ్గలేదు. భారతీయులు బంగారాన్ని కూడా గొప్ప పెట్టుబడిగా భావిస్తారు. ప్రజలు దీనిని శాంతి, ఆనందం, అదృష్టం , ఆధ్యాత్మిక శాంతి వంటి వివిధ కారణాల కోసం ఉపయోగిస్తారు. ఈ రోజు బంగారు ఉంగరాలను వేలికి ధరించాలి? ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం..

ఉంగరపు వేలుకు బంగారు ఉంగరం ధరించడం వల్ల ఆధ్యాత్మిక శక్తులు ఆకర్షించబడతాయి. ఇది శాంతి, ఉత్సాహం, ఆనందం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దుష్ట శక్తుల వల్ల కలిగే అడ్డంకులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక బలాన్ని పొందడానికి స్త్రీలు తమ ఎడమ చేతి ఉంగరపు వేలుకు, పురుషులు తమ కుడి చేతి ఉంగరపు వేలుకు బంగారు ఉంగరం ధరించడం ప్రయోజనకరం.

బంగారం అన్ని గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ.. జ్యోతిషశాస్త్రంలో ముఖ్యంగా గురు గ్రహంతో (బృహస్పతి) ముడిపడి ఉంటుంది. అలాగే సూర్యుడు వంటి శక్తివంతమైన గ్రహాలతో అనుబంధం కలిగి ఉంటుంది. కనుక గురు దోషం ఉన్నవారు , బలహీనమైన గురు బలం ఉన్నవారు బంగారాన్ని ఉపయోగించడం మంచిది. ఎవరైనా బంగారం ఇష్టం లేదని అంటున్నారంటే.. వారు చాలా దురదృష్టంతో బాధపడుతున్నారని అర్థం.

బంగారు ఉంగరాలను ధరించడం తరచుగా రెండు చేతుల ఉంగరపు వేలును అదృష్టంగా భావిస్తారు. అనేక సంప్రదాయాలలో ఈ వేలు సూర్యుడితో ముడిపడి ఉంటుంది. హృదయానికి ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు.

చూపుడు వేలుకు బంగారు ఉంగరం ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం, నాయకత్వ సామర్థ్యాలు పెరుగుతాయని, ఇది కెరీర్, వ్యక్తిగత ప్రయత్నాలలో అదృష్టానికి దారితీస్తుందని భావిస్తారు. పరధ్యానం, మానసిక అశాంతిని అనుభవిస్తుంటే చూపుడు వేలుకు బంగారాన్ని ధరించడం వల్ల అద్భుతాలు జరుగుతాయి.

మధ్య వేలుకు బంగారు ఉంగరం ధరించడం వల్ల సమతుల్యత, స్థిరత్వం లభిస్తుందని, జీవితంలో మొత్తం అదృష్టానికి దారితీస్తుందని కొందరు నమ్ముతారు. కీర్తి , హోదాకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మధ్య వేలుకు బంగారు ఉంగరం ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది.

కొన్ని సంప్రదాయాలలో చిటికెన వేలు తెలివితేటలు, సంభాషణలతో ముడిపడి ఉంటుంది. ఈ వేలికి బంగారు ఉంగరం ధరించడం వల్ల అదృష్టం వస్తుందని భావిస్తారు. అంతేకాదు జలుబు లేదా దగ్గుతో బాధపడుతుంటే చిటికెన వేలికి గోల్డ్ రింగ్ ధరించడం వల్ల కోలుకుంటారు.

కొందరు బొటనవేలుపై బంగారు ఉంగరం ధరించడం వల్ల వ్యాపారం, ఆర్థిక విషయాలలో అదృష్టం కలుగుతుందని నమ్ముతారు.




