- Telugu News Photo Gallery Do you know what color clothes to wear while worshipping Goddess Lakshmi every day during Diwali?
దీపావళి : లక్ష్మీపూజ సమయంలో ఏ రంగు దుస్తులు ధరించాలి? ఏవి ధరించకూడదో తెలుసా?
దీపావళి పండుగ వచ్చేస్తుంది. అక్టోబర్ 20 సోమవారం రోజున ప్రతి ఒక్కరూ దీపావళి పండగను సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఇక దీపావళి అంటే చాలు, ఇంటిని శుభ్రపరుచుకోని, ఇంటిని దీపాలతో అందంగా అలంకరించుకుంటారు. అదే విధంగా లక్ష్మీదేవిని పూజించుకుంటారు. అయితే పూజ సమయంలో ఎన్నో నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా దీపావళి రోజూ లక్ష్మీ పూజ చేసే సమయంలో ధరించే రంగులకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందట. ఈ రోజు ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. దాని గురించే తెలుసుకుందాం.
Updated on: Oct 17, 2025 | 2:55 PM

దీపావళి రోజున లక్ష్మీపూజ చేయడం చాలా మంచిది. ఈ రోజు మహిళలు తప్పకుండా పసుపు రంగు దుస్తులు ధరించాలని చెబుతున్నారు పండితులు. పసుపు రంగు అనేది బృహస్పతి గ్రహాన్ని సూచిస్తుంది. అందువలన శాంతి, సంపదకు ప్రతీక అయిన పసుపు రంగు దుస్తులు ధరించి, పూజ చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందంట.

అదే విధంగా దీపావళి సమయంలో లక్ష్మీ పూజ చేసే సమయంలో ఎరుపు రంగు దుస్తులు ధరించడం కూడా చాలా శ్రేయస్కరం అంటున్నారు పండితులు. ఎరుపు రంగు శక్తి, ధైర్యం, ప్రేమకు ప్రతి రూపమైనది, ఇది కుజ గ్రహంతో సంబంధం ఉంటుంది. అందువలన దీపావళి సమయంలో ఎరుపు రంగు దుస్తులు ధరించడం వలన కూడా ధనప్రాప్తి కలుగుతుందంట.

తెలుపు రంగు దుస్తులు శాంతికి ప్రతీకం. అయితే దీపావళి పండుగ రోజు తెలుపు రంగు దుస్తులు ధరించి లక్ష్మీ పూజ చేయడం మంచిదంట. తెలుపు రంగు దుస్తులు ధరించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుందంటున్నారు పండితులు.

ఇక దీపావళి పండగ రోజున లక్ష్మీ పూజ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీలం రంగు దుస్తులను ధరించకూడదంట. ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేయడం వలన పాజిటివ్ వైబ్స్ తగ్గడమే కాకుండా, ఇంట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయంట.

అదే విధంగా నలుపు రంగు దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదని చెబుతున్నారు పండితులు. ఎందుకంటే నలుపు అనేది శని దేవుడికి సంబంధించినది, ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేయడం అశుభకరం, దీని వలన మానసిక ఒత్తిడి, నిరాశ వంటి అనేక సమస్యలు తలెత్తుతాయంట.



