AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2025: మీకు ఇప్పటికే లంగ్స్, ఊపిరి తీసుకోవడంలో సమస్యా ! దీపావళి రోజున వాయు కాలుష్యాన్ని ఎలా ఎదుర్కోవాలంటే..

దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గాలి కాలుష్యం అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారింది. గాలి నాణ్యత పేలవమైన స్థాయిలో ఉంది. అయితే దీపావళి బాణసంచాతో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. బలహీనమైన ఊపిరితిత్తులు ఉన్నవారికి, అలర్జీ సమస్య ఉన్నవారు ఈ గాలిని పీల్చడం ప్రమాదకరం. నిపుణులు ప్రదేశాలకు వెళ్లడాన్ని పరిమితం చేయాలని , సురక్షితంగా శ్వాస తీసుకోవడానికి మాస్క్‌లు లేదా ప్యూరిఫైయర్‌లను ఉపయోగించాలని కోరుతున్నారు.

Diwali 2025: మీకు ఇప్పటికే లంగ్స్, ఊపిరి తీసుకోవడంలో సమస్యా ! దీపావళి రోజున వాయు కాలుష్యాన్ని ఎలా ఎదుర్కోవాలంటే..
Diwali Air Pollutions
Surya Kala
|

Updated on: Oct 18, 2025 | 12:32 PM

Share

దీపావళి బాణసంచా కాల్చడం ప్రారంభం కావడానికి ముందే.. అనేక ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. రోడ్లమీద ప్రయాణించే వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే విష వాయులు, విషపూరిత పొగ ఇళ్ళు , రోడ్లను కప్పేస్తున్నాయి. ఇప్పటికే పెళుసుగా ఉండే ఊపిరితిత్తులు ఉన్నవారికి, COPD లేదా ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి.. వాయు కాలుష్యం అసౌకర్యంగా ఉంటుంది. ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది. దీపావళి పండుగ పటాకులు కాల్చే సమయం దగ్గర పడుతున్నందున.. సరైన జాగ్రత్తలు తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

దీపాల పండుగ ఆనందం, ఐక్యతను తెస్తుంది. కానీ దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి COPD (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్)బాణా సంచా కాల్చడం వలన వెలువడే పొగ, కాలుష్యం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి. బాణసంచా కాల్చడం వలన వచ్చే కణికలు, విష వాయువుల వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తుంది. దగ్గును ప్రేరేపిస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకోక పొతే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి కూడా తలెత్తుతుంది.

దీపావళికి ముందే ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే..

వైద్యుడిని సంప్రదించండి: మీ చికిత్స ప్రణాళికను సమీక్షించండి, మందులు, ఇన్హేలర్లు ఇంట్లో నిల్వ ఉన్నాయని నిర్ధారించుకోండి. రెస్క్యూ ఇన్హేలర్‌ను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోండి.

ఇవి కూడా చదవండి

వాతావరణాన్ని సిద్ధం చేసుకోండి: మీ ప్రధాన నివాస ప్రాంతంలో HEPA ఫిల్టర్ ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ఉపయోగించండి. ఇండోర్ కాలుష్యాన్ని తగ్గించడానికి కిటికీలు , తలుపులను మూసివేయండి.

టీకాలు వేయించుకోండి: శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి ఫ్లూ , న్యుమోనియా టీకాలను తీసుకోండి.

ముందుగా ప్లాన్ చేసుకోండి: కాలుష్య స్థాయిలు సాపేక్షంగా తక్కువగా ఉన్నప్పుడు రోజు ముందుగా బహిరంగ కార్యకలాపాలను పూర్తి చేయండి.

ఇండోర్ గాలి నాణ్యతను మెరుగుపరచండి: కాలుష్య భారాన్ని సహజంగా తగ్గించడానికి పీస్ లిల్లీ, స్నేక్ ప్లాంట్ వంటి గాలిని శుద్ధి చేసే ఇండోర్ మొక్కలను ఉంచండి.

వీలైనంత వరకు ఇంటి లోపలే ఉండండి. ముఖ్యంగా బాణసంచా కాల్చే సమయంలో.. తరువాత. కిటికీలు మూసి ఉంచండి.

తప్పనిసరిగా బయటకు అడుగు పెట్టవలసి వస్తే.. హానికరమైన గానిలి పీల్చడాన్ని తగ్గించడానికి ధృవీకరించబడిన N95 లేదా N99 మాస్క్ ధరించండి.

వెచ్చని ద్రవాలు పుష్కలంగా త్రాగండి , వాపును పెంచే నూనె పదార్ధాలను లేదా వేయించిన ఆహారాలను నివారించండి.

దగ్గు, గురక లేదా ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండండి. సూచించిన మందులను వెంటనే వాడండి. లక్షణాలు తీవ్రమైతే వైద్య సలహా తీసుకోండి.

దీపావళి తర్వాత ఇంటిలోకి సురక్షితంగా గాలి ప్రసరించేందుకు ప్రత్యామ్నాయం

వాయు కాలుష్య స్థాయిలు తగ్గడం ప్రారంభించిన తర్వాత తాజా గాలి లోపలికి వచ్చేలా పరిమిత సమయం పాటు కిటికీలు తెరవండి.

ప్రతిరోజూ గాలి నాణ్యతను తనిఖీ చేయండి. బహిరంగ కార్యకలాపాలను తెలివిగా ప్లాన్ చేసుకోవడానికి గాలి నాణ్యత సూచిక (AQI) యాప్‌లను ఉపయోగించండి. AQI తక్కువగా ఉన్న రోజుల్లో ఉదయం వాకింగ్ కు దూరంగా ఉండండి.

సమతుల్య ఆహారం తీసుకోండి, హైడ్రేటెడ్ గా ఉండండి. వైద్యుడు సూచించిన విధంగా శ్వాస వ్యాయామాలు చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)