AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: హనుమంతుడి గుడికి కోతి.. భక్తితో పువ్వుల దండను సమర్పించిన వానరం..

కోతికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది. అసలు డార్విన్ సిద్ధాంతం ప్రకారం మానవుడు కోతి నుంచే వచ్చాడు. అందుకనే ఎవరైనా కొంచెం అల్లరి గా ఉంటే కోతిలా అల్లరి చేస్తున్నాడు.. కోతి పనులు ఏమిట్రా అంటూ ఇలా తరచుగా కోతితో పోలుస్తూ తిడతారు. అంతేకాదు కోతిని ఆంజనేయ స్వరూపం వానరుడుగా భావిస్తారు. సోషల్ మీడియాలో తరచుగా కోతికి సంబంధించిన రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో కోతి హనుమంతుడి ఆలయానికి వెళ్ళింది. అక్కడ స్వామిని పూజిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Viral Video: హనుమంతుడి గుడికి కోతి.. భక్తితో పువ్వుల దండను సమర్పించిన వానరం..
Monkey Video Viral
Surya Kala
|

Updated on: Oct 18, 2025 | 1:45 PM

Share

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో భక్తుల అందరి హృదయాలను తాకింది. ఈ వైరల్ వీడియోలో ఒక కోతి బజరంగబలి విగ్రహం ముందు భావోద్వేగానికి గురవుతున్నట్లు కనిపిస్తుంది. వీడియోలో వానరం తన చిన్న చేతుల్లో పూల దండను తెచ్చి భక్తితో బజరంగబలి మేడలో వేసింది. తరువాత అది అక్కడే కుర్చుని భక్తితో చేతులు జోడించి ప్రార్ధించింది.

జంతువులు కూడా దేవుని భక్తులు అయితే

ఈ దృశ్యం చాలా భావోద్వేగంగా ఉంది. ఇది చూస్తున్న వారు ఎవరైనా ఒక్క క్షణం ఆగి ఆలోచనలో మునిగిపోతారు. చాలామంది ఈ వీడియోను భక్తికి నిజమైన ఉదాహరణగా అభివర్ణిస్తున్నారు. సోషల్ మీడియాలో వినియోగదారులు దీనిని షేర్ చేస్తున్నారు. “జంతువులు కూడా దేవుని పాదాల వద్ద తల వంచినప్పుడు ఇది నిజమైన భక్తి” అని కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

AI తో చేసిన వీడియో

భారతదేశంలోని ఒక హనుమాన్ ఆలయంలోకి ఒక కోతి చేతుల్లో బంతి పువ్వు దండను పట్టుకుని ప్రశాంతంగా నడుస్తూ వెళ్లి హనుమంతుడి మెడలో దండను వేసి, భక్తితో చేతులు జోడించి ప్రార్ధించింది. ఆ సమయంలో ఆలయ గంటలు మృదువుగా మోగుతున్నాయి. అయితే ఈ వీడియో వెనుక ఉన్న నిజం వెలుగులోకి వచ్చినప్పుడు.. ప్రజల ఆశ్చర్యం రెట్టింపు అయింది. నిజానికి ఈ వీడియో నిజమైనది కాదు. AI సహాయంతో సృష్టించబడింది. విజువల్స్ చాలా వాస్తవికంగా ఉన్నాయి. ఎవరైనా మొదటి సారి చూసినప్పుడు ఇది నిజమైన సంఘటన అని అనుకుంటారు.

ఈ రోజుల్లో AI-జనరేటివ్ సాధనాలు చాలా అభివృద్ధి చెందాయి. అవి ఏదైనా ఊహాత్మక దృశ్యాన్ని పూర్తిగా వాస్తవికంగా మార్చగలవు. మానవులు, జంతువులు లేదా మతపరమైన భావాలను వర్ణించే వీడియోలు ఇప్పుడు చాలా వాస్తవికంగా కనిపిస్తున్నాయి. వాస్తవికత , వర్చువల్ ప్రపంచాన్ని వేరు చేయడం కష్టం.

వీడియో చూసిన తర్వాత వినియోగదారులు ఏమి అన్నారు? ఈ వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో లక్షలాది సార్లు వీక్షించారు. కొందరు దీనిని అద్భుతంగా పిలుస్తుండగా.. మరికొందరు AI టెక్నాలజీపై తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. “టెక్నాలజీ ఇప్పుడు భక్తిని కూడా డిజిటలైజ్ చేస్తోంది” అని పేర్కొన్నారు.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..