అక్కడ కిలో స్వీట్స్ రూ.21 వేలు.. అయినా ఎగబడి కొంటున్న కస్టమర్స్.. రీజన్ ఏమిటంటే..
దీపావళి వస్తుందంటే చాలు మార్కెట్ లోని దుకాణాల్లో రకరకాల స్వీట్స్ సందడి చేస్తాయి. గులాబ్ జామూన్, పెడా, బర్ఫీ రకాలు, కాజు కట్లీ, హల్వా, కేసరి వంటి అనేక రకాల స్వీట్స్ అందుబాటులో ఉంటాయి. వీటి ధర మహా అయితే కిలో 2 వేలు ఉంటుందేమో.. అయితే ఇప్పుడు మార్కెట్ లో కిలో 21,000 రూపాయలకు అమ్ముడవుతున్న స్వీట్ సంబంధించిన వార్త చక్కట్లు కొడుతోంది. దీనిని "సోనేరి భోగ్" అని పిలుస్తారు. ఈ స్వీట్ అమ్మకాలు దేశ వ్యాప్తంగానే కాదు విదేశాల్లో కూడా జరుగుతున్నాయి.

దీపావళి పండుగకు.. స్వీట్లకు చాలా కాలంగా అవినాభావ సంబంధం ఉంది. దీపావళి నాడు ప్రజలు స్వీట్లు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా తమ ఆనందాన్ని పంచుకుంటారు. ఈ ఏడాది మహారాష్ట్రలోని అమరావతి మార్కెట్‌లో ఒక స్వీట్ షాప్ లో అమ్ముతున్న స్వీట్ సంచలనం సృష్టించింది. ఈ స్వీట్ పేరు సోనేరి భోగ్. పేరుకి తగినట్లుగానే ఈ స్వీట్ కి బంగారు రంగుని జోడించారు. రఘువీర్ రిఫ్రెష్మెంట్స్ అనే హోటల్ యజమాని రియల్ 24 క్యారెట్ల బంగారం తో చేసిన కాగితంతో సోనేరి భోగ్ స్వీట్‌ను కస్టమర్స్ కు పరిచయం చేశాడు.
దీపావళి శుభ సందర్భంగా కస్టమర్లను ఆకర్షించడానికి రూపొందించబడిన ఈ స్వీట్ కేవలం ఒక ట్రీట్ మాత్రమే కాదు.. ఒక కళాఖండం. ఇది పిస్తాపప్పులు, మమ్రా బాదం, కుంకుమపువ్వు , హాజెల్ నట్స్ వంటి అత్యుత్తమమైన , అత్యంత ఎంపిక చేయబడిన డ్రై ఫుట్స్ తో రూపొందించబడింది. ఈ స్వీట్ ఇప్పుడు ఒక ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ స్వీట్ ను కిలో ₹ 21,000 కు అమ్ముతున్నారు.
గుంపులు గుంపులుగా కస్టమర్లు
అంత ఖరీదైన స్వీట్ అయినప్పటికీ.. ఈ స్వీట్ భారీ సంఖ్యలో వినియోగదారులను ఆకర్షిస్తోంది. విశేషమైన విషయం ఏమిటంటే ఈ స్వీట్ కు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇది భారతదేశంలోతో పాటు విదేశాలలో కూడా అమ్ముడవుతోంది. ప్రజలు దీనిని విపరీతంగా ఇష్టపడుతున్నారు. 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన మంచి రుచికరమైన ఈ స్వీట్ ప్రజలలో చర్చనీయాంశంగా మారింది.
కిలో స్వీట్లు 1,11,000 రూపాయలు
అదేవిధంగా రాజస్థాన్‌లోని జైపూర్ మార్కెట్లలో బంగారం పొదిగిన స్వీట్లు బాగా ప్రాచుర్యం పొందాయి. నగరంలోని దుకాణాలు సంప్రదాయం, ఆధునికతల మిశ్రమాన్ని ప్రదర్శించాయి. ఇవి స్వీట్ల నిర్వచనాన్నే పునర్నిర్వచించాయి. స్వర్ణ ప్రసాదం అనే స్వీట్ చాలా ఇష్టపడే స్వీట్. దీని ధర కిలోగ్రాముకు సుమారు రూ. 1,11,000 . ఈ ప్రత్యేక స్వీట్ పైన్ గింజలు, బంగారు బూడిద, కుంకుమ పువ్వు వంటి వాటిని ఉపయోగించి స్పెషల్ గా అత్యంత శ్రద్దగా తయారు చేస్తారు. ఇది చాలా ఆకర్షణీయంగా, రాజరికం ఉట్టిపడేలా ఉంటుంది. దీని ప్యాకేజింగ్ కూడా నగల పెట్టె శైలిలో చేయబడుతుంది. ఇది ఒక చిరస్మరణీయ బహుమతిగా మారుతుంది.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








