AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moles: మ‌గ‌వారికి ఈ ప్లేస్‌ల‌లో పుట్టుమ‌చ్చ ఉంటే పంట పండినట్లే.. పట్టపగ్గాలు ఉండవ్..

మగవారి శరీరంలోని వివిధ భాగాలపై ఉండే పుట్టుమచ్చల ఫలితాలను పండితులు వివరిస్తున్నారు. నుదుటి మధ్యలో, గడ్డంపై, చెంపలపై, నాలుకపై, మెడపై పుట్టుమచ్చలు ఉన్న పురుషుల జీవితం, స్వభావం, అదృష్టం, సంబంధాలపై వాటి ప్రభావం గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం ... ...

Moles: మ‌గ‌వారికి ఈ ప్లేస్‌ల‌లో పుట్టుమ‌చ్చ ఉంటే పంట పండినట్లే.. పట్టపగ్గాలు ఉండవ్..
Moles
Ram Naramaneni
|

Updated on: Dec 15, 2025 | 3:12 PM

Share

పురుషులకు శరీరంలోని వివిధ భాగాలపై ఉండే పుట్టుమచ్చలు, వాటి ప్రభావాలు, అదృష్టం, వ్యక్తిత్వ లక్షణాల గురించి పండితులు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పురుషులకు నుదుటి మధ్యలో, అంటే కనుబొమ్మల మధ్యలో పుట్టుమచ్చ ఉండి దానికి వెంట్రుకలు కూడా ఉంటే, అటువంటి వారికి తిరుగు ఉండదు. వారు అపారమైన ఐశ్వర్యవంతులు అవుతారని, గొప్ప సంపద వస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ భాగంలో ఎక్కడైనా పుట్టుమచ్చ పెద్దదిగా ఉండి దాని నుంచి వెంట్రుకలు వస్తే అది శుభప్రదమైనదట. నెత్తి మీద, ముఖ్యంగా నడినెత్తి మీద పుట్టుమచ్చ ఉన్న పురుషులకు గర్వం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. వారు ఎవరికీ సమాధానం ఇవ్వకుండా, అహంకారంతో ఉంటారట

గడ్డం మీద పుట్టుమచ్చ ఉన్న పురుషులు బంధుప్రీతి కలిగి ఉంటారు. వీరు తమ బంధువుల పట్ల అధిక ప్రేమను కలిగి ఉండి, వారికి మర్యాదలు చేయడానికి, బాగా చూసుకోవడానికి, సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తారని పండితులు తెలిపారు. కుడి చెంప మీద పుట్టుమచ్చ ఉంటే, వారికి కేవలం బంధుప్రీతి మాత్రమే కాకుండా, ప్రపంచంలోని ప్రజలందరి పట్ల ప్రీతి ఉంటుంది. వారు అందరినీ ఉద్ధరించాలని, అందరి శ్రేయస్సును కోరుకుంటూ, తెలియని వారి కష్టాల కోసం కూడా తాపత్రయ పడతారని పేర్కొంటున్నారు. నాలుక మీద పుట్టుమచ్చ ఉన్నవారి మాట చాలా స్పష్టంగా, అవతలి వారిని ఆకర్షించే విధంగా ఉంటుందట.

ఎడమ చెంప మీద, ఎడమ భుజం మీద లేదా ఎడమ మెడ మీద పుట్టుమచ్చ ఉన్న పురుషులకు మంచి భార్య లభిస్తుందట. ఎడమ భాగం భార్య భాగం కాబట్టి, అలాంటి పుట్టుమచ్చలు ఉన్నవారికి అనుకూలవతి అయిన భార్య వస్తుందని, ఆమె భర్త చెప్పిన మాట వింటూ, ఇద్దరూ అన్యోన్యంగా, పార్వతీ పరమేశ్వరులు లేదా సీతారాముల వలె ఉంటారని తెలిపారు. మంచి భోజన ప్రియుడైన భర్తకు ఆమె చక్కటి వంటలు చేసి పెడుతుందని, భర్త వెళ్లే సమయానికి అన్నింటినీ సమకూరుస్తుందని, భర్త వద్దు అంటే వెంటనే ఆగిపోతుందని, అలాంటి ఆదర్శవంతమైన భార్య లభిస్తుందని ఆమె వివరించారు. నుదుటి మీద పుట్టుమచ్చ ఉంటే వారి తలరాత అద్భుతంగా ఉంటుందని, వారు ఏ పని చేసినా తృప్తిగా ఉంటూ ఆనందంగా జీవిస్తారని, అద్భుతమైన, తృప్తికరమైన జీవితాన్ని గడుపుతారని పండితులు తెలియజేశారు. కంఠం మీద పుట్టుమచ్చ ఉన్న పురుషులకు సంతానం పట్ల అమితమైన ప్రేమ ఉంటుందని, వారిపై దృష్టి సారించి, వారిని సంరక్షించి, ఒక మంచి స్థాయికి తీసుకువస్తారని వివరించారు. వారి మాట వింటూ, గౌరవిస్తూ, పిల్లల కోరికలను తీరుస్తూ, వారికి ఏది ఇష్టమో అది చూసుకుంటూ, పిల్లల పట్ల  ప్రేమను అధికంగా కలిగి ఉంటారని చెప్పారు.

నలుపు కాకుండా నీలం రంగులో పుట్టుమచ్చలు ఉన్నవారికి ఏ భాగంలో ఉన్నా వారి మైండ్ సెట్ సరిగా ఉండదని, ఇప్పుడు చెప్పింది మరొకలా, అప్పుడు చెప్పింది మరొకలా ఉంటుందని, వారికి మతిమరుపు కూడా ఎక్కువగా ఉంటుందని పండితులు వెల్లడిస్తున్నారు. అలాంటి నీలం రంగు మచ్చలు ఎక్కువగా ఉంటే అది ఆరోగ్య సమస్య కూడా అయి ఉండవచ్చు కాబట్టి వైద్యుడిని సంప్రదించి చూపించుకోవాలని సూచిస్తున్నారు.

(ఇది కేవలం ఆధ్యాత్మిక కోణంలో పండితుల నుంచి సేకరించిన సమాచారం. సైంటిఫిక్‌గా నిర్ధారితం కాదు)

Also Read: పిచ్చుకలు ఇంట్లోకి పదే పదే వస్తున్నాయా..? దానికి అర్థం ఏంటో తెలుసా

మ‌గ‌వారికి ఈ ప్లేస్‌ల‌లో పుట్టుమ‌చ్చ ఉంటే ఎంతో లక్కీ..
మ‌గ‌వారికి ఈ ప్లేస్‌ల‌లో పుట్టుమ‌చ్చ ఉంటే ఎంతో లక్కీ..
నో రెస్ట్ ఫర్ స్టార్స్..ఫ్రీగా ఉన్నారా? ఆ మ్యాచ్ ఆడాల్సిందే
నో రెస్ట్ ఫర్ స్టార్స్..ఫ్రీగా ఉన్నారా? ఆ మ్యాచ్ ఆడాల్సిందే
ఎన్నికల్లో పార్టీ ఓటమి.. మీసాలు తీయించుకున్న కార్యకర్త
ఎన్నికల్లో పార్టీ ఓటమి.. మీసాలు తీయించుకున్న కార్యకర్త
న్యూ ఇయర్ వేడుకల్లో ఈ పనులు చేస్తే జైలుకే.. పోలీసుల కొత్త రూల్స్.
న్యూ ఇయర్ వేడుకల్లో ఈ పనులు చేస్తే జైలుకే.. పోలీసుల కొత్త రూల్స్.
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..