AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indrakeeladri: మహా నవమి రోజు మహిషాసుర మర్దినిగా దుర్గమ్మ దర్శనం..

ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమై... అక్టోబర్ 2 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ 11 రోజులు దుర్గాదేవి వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తోంది. దసరా నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ పదవ రోజున శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది.

Indrakeeladri: మహా నవమి రోజు మహిషాసుర మర్దినిగా దుర్గమ్మ దర్శనం..
Indrakeeladri
Surya Kala
|

Updated on: Oct 01, 2025 | 8:47 AM

Share

దేశ వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువైన అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనక దుర్గమ్మ 11 రోజులు పాటు…11 అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తోంది. ఈ రోజు నవరాత్రిలో 10వ రోజు. మహా నవమి సందర్భంగా దుర్గాదేవి శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తోంది.

మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు దేవతలంతా తమ శక్తులను జోడించి దుర్గాదేవిని సృష్టించారు. మహా నవమి రోజున దుర్గాదేవిని అపరాజితగా పూజిస్తారు. మహిషాసురమర్దిని అలంకారంలో అమ్మవారు సింహవాహినిగా పది చేతులలో పది ఆయుధాలను ధరించి రౌద్ర రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ రోజు మహిషాసురమర్దినికి ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించడం, ఎరుపు రంగు పువ్వులతో పూజించడం శుభప్రదం అని నమ్మకం. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే శత్రువులపై విజయం సాధిస్తారని .. జీవితంలో కలిగే అన్ని భయాలు తొలగిపోతాయని నమ్మకం. మంత్ర, తంత్ర, యంత్రాలన్నీ జగన్మాతలోనే చేరుతాయి. ఆ జగన్మాతే మహిషాసుర మర్దిని.

వాస్తవానికి దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాల్లో అమ్మవారిని పూజిస్తారు. అయితే ఈ ఏడాది ఒకే తిథి రెండు రోజులు వచ్చింది. దీంతో నవరాత్రులు 10 రోజులు వచ్చాయి. అందుకనే నవరాత్రి తొమ్మిదో రోజు మహిషాసుర మర్దనిగా దర్శనం ఇచ్చే అమ్మవారు ఈ సంవత్సరం పదో రోజున దర్శనం ఇస్తుంది. రేపు దసరా పండగను.. జరుపుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..