AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips for Home: ఇంట్లో కలతలా.. ఇంటి వంటగది, పిల్లల గది ఏ దిక్కున ఉందో చెక్ చేసుకోండి..

ఇల్లు కట్టినా, కొన్నా.. ప్రతి ఒక్కరూ వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం  ఉండాలనుకుంటారు. అలాంటప్పుడు ముందుగా ఇంటి వాస్తును సరిచూసుకుని అందులో ఏదైనా దోషం ఉంటే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. అయితే చాలా మంది తమ ఇంటి వాస్తు గురించి తమకు ఏమీ తెలియదని అంటారు.

Astro Tips for Home: ఇంట్లో కలతలా.. ఇంటి వంటగది, పిల్లల గది ఏ దిక్కున ఉందో చెక్ చేసుకోండి..
Vastu Tips For House
Surya Kala
|

Updated on: May 16, 2023 | 8:04 AM

Share

ఇంటిలో అన్నీ ఉంటాయి.. అయితే ఆ ఇంట్లో ఆనందం ఉండదు. కుటుంబ సభ్యులు డిప్రెషన్‌లో ఉంటారు. కొన్ని ఇళ్లలో కలహాలు ఉన్నాయి. కొన్ని సార్లు కారణం లేకుండానే కుటుంబ సభ్యులు గొడవ పడుతూ ఉంటారు. దీని కారణం ఎవరో చేసిన పనులు కాదు.. కొన్ని సార్లు వాస్తు దోషాలు కూడా కుటుంబంలో వివాదాలకు కారణం కావచ్చు.  అందుకే ఇల్లు కట్టినా, కొన్నా.. ప్రతి ఒక్కరూ వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం  ఉండాలనుకుంటారు. అలాంటప్పుడు ముందుగా ఇంటి వాస్తును సరిచూసుకుని అందులో ఏదైనా దోషం ఉంటే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. అయితే చాలా మంది తమ ఇంటి వాస్తు గురించి తమకు ఏమీ తెలియదని అంటారు. అయితే కొందరు వాస్తు శాస్త్ర నిపుణులు ఇంట్లో ఉంచిన వస్తువుల గురించి కొన్ని విషయాలు చెప్పారు. వాస్తు దోషాన్ని తొలగించడానికి అవి సహాయపడతాయి.

ఇంటి ఉత్తర- తూర్పు దిశ

ఇంటి వాస్తును పరిశీలిస్తే.. ముందుగా ఇంటి ఉత్తరం.. తూర్పు దిక్కులు మూసి ఉండకూడదు. అంతేకాదు ఇంటికి ధారాళంగా గాలి, వెలుతురు వచ్చే విధంగా ఉండాలి. అదే సమయంలో.. తూర్పు దిశ నుంచి మంచి కాంతి ప్రసరిస్తుంది. ఉత్తరం, తూర్పు దిశలో ఉన్న ఇళ్ళు ..ఆ ఇంటి వాస్తు చాలా సానుకూలంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వాయువ్య మూలలో

డ్రాయింగ్ రూమ్ ఎల్లప్పుడూ ఇంటికి వాయువ్య దిశలో ఉండాలి. ఎప్పుడూ కదులుతుండే వస్తువులను ఉత్తరం వైపు ఉంచడం మంచిది. అటువంటి సమయాల్లో అతిథిల కోసం ఏర్పాటు చేసే రిసెప్షన్ గదికి ఉత్తమ దిశగా ఈ మూల పరిగణించబడుతుంది. అయితే, డ్రైయింగ్ రూమ్‌తో పాటు, మీరు మీ కారు లేదా బైక్‌ను కూడా ఈ దిశలో పార్క్ చేయవచ్చు.

వంటగది దిశ

వంటగది ఇంట్లో అంతర్భాగం కాబట్టి.. ఈ గది దిశను ఖచ్చితంగా పాటించాలి. వంటగదిని ఎల్లప్పుడూ ఆగ్నేయంలో అంటే నైరుతి కోణంలో నిర్మించడం ఉత్తమం. ఈ దిశలో రూపొందించిన వంటగది వాస్తు శాస్త్ర ప్రకారం ఉత్తమం. చేసే వంట రుచికరమైనదిగా ఉంటుంది. అంతే కాదు, ఆగ్నేయ కోణంలో నిర్మించిన వంటగది గృహిణుల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది.

ఇంటి బ్రహ్మస్థానం

ఇంటి మధ్యభాగాన్ని బ్రహ్మస్థానం అంటారు. ఇంట్లోని బ్రహ్మస్థానం ఎప్పుడూ తెరిచి ఉండాలి. ఈ ప్రదేశంలో డైనింగ్ టేబుల్, సోఫా లేదా ఇతర బరువైన వస్తువులు వంటి భారీ ఫర్నిచర్‌ను ఉంచవద్దు.

బెడ్ రూమ్ కు సరైన దిశ

ఇంటిలో పడకగది ఏర్పాటు చేసే దిశ కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. నైరుతిలో బెడ్ రూమ్ ఏర్పాటు చేయడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. అదే విధంగా ఇంటికి పెద్ద కొడుకు పడకగది దక్షిణ దిశలో మధ్యలో ఉండాలి.. తద్వారా అతను కెరీర్ పురోగతి , విజయాన్ని పొందుతాడు.

పిల్లల బెడ్ రూమ్

పశ్చిమ దిశ మధ్యలో పిల్లలకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేయండి. పశ్చిమ దిశ కూడా అధ్యయనానికి మంచిదని భావిస్తారు. అలాగే, పిల్లల కోసం పడకగది చేయడానికి వాయువ్య దిశను మంచిగా భావిస్తారు. ఇది వారి చదువులకు సహాయపడుతుంది. అయితే గదిలో పిల్లల స్టడీ టేబుల్ తూర్పు దిశలో ఉండాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).