Dream Astrology: కలలో ఈ సంకేతాలు కనిపిస్తే.. పెళ్లి కుదురుతుందని.. ధనవంతుడు లభిస్తాడట..
భవిష్యత్తులో జరగబోయే సంతోషకరమైన, విచారకరమైన సంఘటనల గురించి ముందస్తు సూచనలే కలలు అని అంటారు. కలలో కనిపించే సంకేతాలను గుర్తించగలిగితే.. మీ భవిష్యత్ లో జరిగే మంచి లేదా చెడు సంఘటనను అంచనా వేయవచ్చు. భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నట్లు కలలో కనిపిస్తే.. దేవుడు అనుగ్రహం కలిగిందని.. త్వరలో ప్రేమ వివాహం జరుగుతుందని అర్థం.
రాత్రి నిద్ర పోయే సమయంలో ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు. అయితే కొన్ని కలలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కలలు కనని వ్యక్తి ప్రపంచంలోనే లేడు. స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కలకి కొంత అర్థం ఉంటుంది. భవిష్యత్తులో జరగబోయే సంతోషకరమైన, విచారకరమైన సంఘటనల గురించి ముందస్తు సూచనలే కలలు అని అంటారు. కలలో కనిపించే సంకేతాలను గుర్తించగలిగితే.. మీ భవిష్యత్ లో జరిగే మంచి లేదా చెడు సంఘటనను అంచనా వేయవచ్చు.
భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నట్లు కలలో కనిపిస్తే.. దేవుడు అనుగ్రహం కలిగిందని.. త్వరలో ప్రేమ వివాహం జరుగుతుందని అర్థం. ఒక అమ్మాయి తన కలలో మండుతున్న లాంతరును తీసుకుని వెళ్తున్నట్లు చూస్తే, ఆమె ధనిక కుటుంబానికి చెందిన అందమైన యువకుడిని వివాహం చేసుకుంటుందని అర్థం
కలలో కప్పను చూడటం ప్రేమికులకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ప్రేమికుల ప్రేమ గెలుస్తుందని అర్థం. ఒక అమ్మాయి విలాసవంతమైన ప్యాలెస్‌లో విందు లేదా వేడుకను ఆస్వాదించబోతున్నట్లు కలలుగన్నట్లయితే.. ఆమె ధనవంతుడితో వివాహం చేసుకుంటుంది.
స్వప్న శాస్త్రం:
మీరు కలలో ఏదైనా తాగుతున్నలు కనిపిస్తే, త్వరలో మీరు వివాహం చేసుకుంటారు. మీకు వివాహం ఆనందంగా ఉంటుంది. ఒక పురుషుడు లేదా స్త్రీ కలలో తన ప్రేమికుడితో కలిసి పార్కులో నడుస్తూ ఉంటే, ప్రేమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.
ఒక అమ్మాయి కలలో స్నేహితుడు ఇచ్చిన బ్రాస్లెట్ ధరించినట్లు కనిపిస్తే ఆమె త్వరలో వివాహం చేసుకుంటుంది. మీ కలలో పిల్లవాడు పిలవడం మీరు చూసినట్లయితే, మీ ప్రేమికుడు మరొక స్త్రీతో కూడా సంబంధాన్ని ఏర్పరచుకున్నాడని అర్థం.
ఎవరైనా కలలో ఉల్లిపాయలు తినడం చూస్తే వారు తమ స్నేహితురాలు లేదా ప్రెమికుల నుండి నిజమైన ప్రేమను పొందుతారు. పెళ్లికాని వ్యక్తి స్నేహితుడి అంత్యక్రియలకు హాజరైన వ్యక్తిని చూస్తే, అతను సంపదతో లాభపడతాడని. అతని వివాహం కూడా త్వరగా కుదురుతుందని అర్థం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).