స్టార్ హీరోలతో పోటీ.. నవీన్ అండ్ శర్వా గట్స్ ఏంటి ??
సంక్రాంతి రేసులో స్టార్ హీరోలతో పాటు నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ తమ సినిమాలపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. 'అనగనగా ఒక రాజు'తో నవీన్, 'నారీ నారీ నడుమ మురారి'తో శర్వానంద్ ఈ పండుగకు హిట్ కొట్టాలని చూస్తున్నారు. ప్రత్యేక ప్రమోషనల్ స్ట్రాటజీలు, కంటెంట్ బలంపై ఆధారపడి, పండగ వాతావరణాన్ని క్యాష్ చేసుకుని విజయం సాధించాలని వీరిద్దరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతి రేసులో తమ సినిమాలకు ఓవర్ ఫ్లోస్ గ్యారంటీ అని నమ్మే స్టార్ హీరోలు మాత్రమే కాదు, వాళ్ల ఓవర్ ఫ్లోలతో మా థియేటర్లు నిండితే చాలనుకునే చిన్న హీరోలు కూడా కాన్ఫిడెంట్‌గా నిలుచున్నారు. ఆల్రెడీ సక్సెస్ మీదున్న నవీన్ పొలిశెట్టి, సంక్రాంతి నాకు బేఫికర్‌గా కలిసొస్తుందంటున్న శర్వానంద్.. ఏంటి వీళ్లిద్దరి కాన్ఫిడెన్స్ కి కారణం…. చూసేద్దాం వచ్చేయండి… స్టార్టింగ్ నుంచీ డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో ప్రాజెక్ట్ కి క్రేజ్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు నవీన్ పొలిశెట్టి. ఎలాగైనా సంక్రాంతి రేసులో హిట్ కొట్టేయాలనే పట్టుదల కనిపిస్తోంది మిస్టర్ పొలిశెట్టిలో. దానికి తగ్గట్టే ప్రతిదీ చక్కగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నారు. పండక్కి నవ్వులు గ్యారంటీ, వినోదం గ్యారంటీ అనే కాన్సెప్ట్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అనగనగా ఒక రాజులో. మా సినిమా కూడా అలాంటి వినోదాన్నే పంచుతుందని చెబుతున్నారు నారీ నారీ నడుమ మురారి మేకర్స్. హిట్ చూసి చాన్నాళ్లయింది శర్వానంద్. ఆ లోటును ఈ సినిమాతో భర్తీ చేయాలన్నది యూనిట్ చేస్తున్న కృషి. ఇద్దరు భామల మధ్య నలిగే హీరో కాన్సెప్టులకు మన దగ్గర ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఈ ఏడాది బరిలో అలాంటి సినిమాలు రెండు. వాటిలో భర్తమహాశయులకు విజ్ఞప్తి ఒకటి. ఇంకోటి నారీ నారీ నడుమ మురారి. కంటెంట్ ఆడియన్స్ కి కనెక్ట్ కావాలేగానీ, పండక్కి హిట్ కొట్టడం రస్క్ తిన్నంత ఈజీ అంటున్నారు శర్వానంద్. పైగా సంక్రాంతి రేసులో స్టార్ హీరోలతో సమానంగా నిలుచుని సక్సెస్ చూసిన సందర్భాలున్నాయని గతాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈ ఏడాది నారీ నారీ నడుమ మురారితో ఎలాగైనా హిట్ గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది శర్వాలో.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: అల్లు సినిమాస్.. భాగ్యనగరంలో ఐకానిక్ ల్యాండ్ మార్క్
Vijay Sethupathi: 2026లో మక్కళ్ సెల్వన్ ప్లానింగ్ అదిరిందిగా
చిరు విత్ వెంకీ.. పండక్కి డబుల్ స్వాగ్ షురూ
The Raja Saab: పుష్ప2 Vs ధురంధర్.. మరి ది రాజాసాబ్ టార్గెట్ ఎవరు ??
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

