AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు విత్‌ వెంకీ.. పండక్కి డబుల్‌ స్వాగ్‌ షురూ

చిరు విత్‌ వెంకీ.. పండక్కి డబుల్‌ స్వాగ్‌ షురూ

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jan 06, 2026 | 4:19 PM

Share

మన శంకరవరప్రసాద్‌ గారు ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, వింటేజ్ చిరంజీవిని చూసే అనుభూతిని ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు. నయనతార ప్రమోషన్లు, వెంకటేష్ మాస్ అప్పియరెన్స్‌తో కూడిన ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ నెల 12న విడుదల కానుంది. పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి.

మెగాస్టార్‌, విక్టరీ హీరో ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఈగర్‌గా ఎదురుచూస్తున్న ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ ట్రైలర్‌ రానే వచ్చేసింది. రిలీజ్‌ కి కౌంట్‌ డౌన్‌ స్టార్ట్ అయిన ఈ సందర్భంలో ట్రైలర్‌ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్‌ చేస్తోంది? మేకర్స్ ఏమంటున్నారు? కమాన్‌ లెట్స్ వాచ్‌… ట్రైలర్‌ రెండున్నర నిమిషాలు మాత్రమే ఉంది… థియేటర్లలో రెండున్నర గంటలకు పైగా రైడ్‌ ఉంటుందంటున్నారు అనిల్‌ రావిపూడి.టైమ్‌ మెషీన్‌లో వెళ్లి వింటేజ్‌ చిరుని చూసి వచ్చినట్టే ఉంటుందట మూవీ చూస్తుంటే. ఓ ఫ్యాన్‌గా చిరుని ఎలా చూడాలనుకుంటానో, అలాగే కథ రాసుకుని సినిమాచేశానన్నది అనిల్‌ మాట. స్వాగ్‌ కా బాప్‌ అంటూ మన శంకరవరప్రసాద్‌గారు లో చిరు యాక్టింగ్‌కి ప్రశంసలు దక్కుతున్నాయి. ఎప్పుడూ ప్రమోషన్లకు రాని నయనతార మూవీని ప్రమోట్‌ చేసిన తీరు కూడా చాలా మందిని ఫిదా చేస్తోంది. ఆమె కాల్షీట్‌ అడ్జస్ట్ చేయబట్టే, సమ్మె సెగ తగిలినా మూవీని సకాలంలో పూర్తి చేయగలిగామని అంటున్నారు మేకర్స్. లాస్ట్ ఇయర్‌ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొందిన విక్టరీ వెంకటేష్‌, ఈ సారి మెగస్టార్‌తో కలిసి మనసులు దోచుకోవడానికి రెడీ అయ్యారు. ఫ్యామిలీస్టార్‌ మాస్‌ అప్పియరెన్స్, మాస్‌ కా బాస్‌.. ఫ్యామిలీస్‌ కోసం చేసే ఫీట్స్ ఈ పండక్కి స్పెషల్‌ అని హింట్‌ ఇచ్చేసింది మనశంకరవరప్రసాద్‌గారు ట్రైలర్‌. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ మూవీ. భీమ్స్ అందించిన సాంగ్స్ కి ఆల్రెడీ మంచి మైలేజ్‌ వస్తోంది. అన్ని రకాల కమర్షియల్‌ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను పలకరించడానికి మేం రెడీ అంటోంది టోటల్‌ టీమ్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

The Raja Saab: పుష్ప2 Vs ధురంధర్‌.. మరి ది రాజాసాబ్‌ టార్గెట్‌ ఎవరు ??

సంక్రాంతికి సక్సెస్ కావాలంటున్న హీరోయిన్లు ఎవరెవరు

తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి

Ram Charan: రామ్‌ చరణ్‌కు కోపం తెప్పించిన స్టార్ డైరెక్టర్

Sai Pallavi: సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూకి అడ్డుగా అమీర్ ఖాన్