Vijay Sethupathi: 2026లో మక్కళ్ సెల్వన్ ప్లానింగ్ అదిరిందిగా
విజయ్ సేతుపతి 2026 ప్లానింగ్‌పై ఆసక్తి నెలకొంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా, 'గాంధీ టాక్స్', 'అరసన్' వంటి చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు విడుదల చేస్తూ, కొత్త పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన విలక్షణమైన పాత్రలు, వేగవంతమైన షెడ్యూల్ సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. సేతుపతి సక్సెస్ రేట్ ఎలా ఉండబోతుందో చూడాలి.
సినిమాలు ఆగాయా? సాగాయా? అనే విషయాలను పక్కనపెడితే, బాక్సాఫీస్ దగ్గర ఎన్ని సినిమాలు క్యూలో నిలుచున్నాయన్నది కూడా ఇవాళ్రేపు చాలా ఇంపార్టెంట్. ప్యాన్ ఇండియా సినిమాల పేరుతో, ఒక్కో సినిమాకూ రెండు, మూడేళ్లు తీసుకుంటున్న యాక్టర్స్ మధ్య.. ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు సేతుపతి. ఆయన మిగిలిన సినిమాలన్నీ ఒక ఎత్తు. పూరితో చేస్తున్న మూవీ మరో ఎత్తు… 2026లో మిస్టర్ సేతుపతి ప్లానింగ్ ఎలా ఉందో చూసేద్దాం పదండి… మా సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని ఆ మధ్య గట్టి అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు పూరి జగన్నాథ్ అండ్ టీమ్. పూరి – సేతుపతి హ్యాష్ ట్యాగ్‌తో ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. సంయుక్త మీనన్, టబు కీ రోల్స్ చేసిన ఈ సినిమా మీద మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న పూరి జగన్నాథ్‌కి ప్యాన్ ఇండియా రేంజ్‌లో కంబ్యాక్ సినిమా అవుతుందనే టాక్ ఉంది. లాస్ట్ ఇయర్ తలైవన్ తలైవితో డిఫరెంట్ రోల్ చేసిన విజయ్ సేతుపతి ఈ సినిమాతో కంప్లీట్ న్యూ అవతార్‌లో కనిపిస్తారని ఎగ్జయిట్ అవుతున్నారు ఫ్యాన్స్. లాస్ట్ ఇయర్ ఒకటికి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు విజయ్ సేతుపతి. ఏస్ మూవీ మన వారికి అంతగా కనెక్ట్ కాకపోయినా, తలైవన్ తలైవి మాత్రం తమిళ ఆడియన్స్ ని మెప్పించింది. శ్రుతి హాసన్‌తో కలిసి నటించిన ట్రైన్ కూడా లాస్ట్ ఇయరే విడుదల కావాల్సింది. కానీ, అనివార్య కారణాలతో వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నెల 30న విజయ్ సేతుపతి గాంఃధీ టాక్స్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. దీంతో పాటు అరసన్ కూడా ఈ ఏడాది సేతుపతి ఖాతాలో కనిపించనుంది. మణిరత్నం దర్శకత్వంలో శింబుతో కలిసి నవాబ్‌లో కనిపించారు సేతుపతి. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారు. నెగటివ్ రోల్స్ ఇక చేయనన్న సేతుపతి, ఇప్పుడు అరసన్‌లో విలన్‌గా చేస్తున్నారా? లేకుంటే సరికొత్తగా ట్రై చేస్తున్నారా? అనే డిస్కషన్ కూడా ఆల్రెడీ షురూ అయింది. 2026 మీద సేతుపతి ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆయన కూడా మంచి హోప్స్ పెట్టుకున్నారు… సక్సెస్ రేట్ ఏ మేర ఉంటుందనే ఆసక్తి ట్రేడ్ వర్గాల్లోనూ కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరు విత్ వెంకీ.. పండక్కి డబుల్ స్వాగ్ షురూ
The Raja Saab: పుష్ప2 Vs ధురంధర్.. మరి ది రాజాసాబ్ టార్గెట్ ఎవరు ??
సంక్రాంతికి సక్సెస్ కావాలంటున్న హీరోయిన్లు ఎవరెవరు
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

