సంక్రాంతికి సక్సెస్ కావాలంటున్న హీరోయిన్లు ఎవరెవరు
ఈ సంక్రాంతి సీజన్‌ను టాలీవుడ్ హీరోయిన్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల, మమితా బైజు, ఆషికా రంగనాథ్ వంటి అగ్ర తారలు తమ తాజా చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నారు. హీరోలతో పాటు హీరోయిన్లకు కూడా ఈ పండుగ సీజన్‌లో ఓ భారీ హిట్ అవసరం. 2026లో తమ కెరీర్‌కు మైలురాయిగా నిలిచే విజయాలు పొందాలని వారు ఆశిస్తున్నారు.
పండగ మీద హోప్స్ పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఫెస్టివ్ వైబ్‌ని ఎలాగైనా పాజిటివ్‌గా చూడాలనుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఈ ఏడాది పొంగల్ రిలీజులకు రెడీ అవుతున్న సినిమాల్లో హీరోయిన్లకు కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా ఇలాంటి విష్ ఉంది. రేసులో ఉన్న సినిమాలతో లేటెస్ట్ గా పలకరించడానికి రెడీ అవుతున్న లేడీస్ గురించి మాట్లాడుకుందాం పదండి… 2026 మీద హోప్స్ పెట్టుకున్న నాయికల లిస్టు తీస్తే ముందు కనిపించేది పూజాహెగ్డే పేరే. లాస్ట్ ఇయర్ రెట్రోతో కాస్త గాడిలోకి వచ్చేసింది పూజా పేరు. ఈ ఏడాది జననాయకుడు మీద ఆశలు పెంచుకుంటున్నారు ఈ లేడీ. ఈ మూవీతో సక్సెస్‌ని కంటిన్యూ చేయాలన్నది పూజా హెగ్డేకి మాత్రమే కాదు… మమిత బైజు కోరిక కూడా. సంక్రాంతి రేసులో జన నాయకుడు హీరోయిన్సే కాదు, మిగిలిన చిత్రాల నాయికలు కూడా సక్సెస్ చూడాలనుకుంటున్నారు. వారిలో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు ఎన్నో రాత్రులొస్తాయి సాంగ్ ఫేమ్ బ్యూటీ ఆషికా రంగనాథ్. ఎన్నో రాత్రులొస్తాయి సాంగ్‌తో తెలుగువారికి ఇన్‌స్టంటగా కనెక్ట్ అయిన ఆషికా రంగనాథ్, ఈ ఏడాది భర్త మహాశయులకు విజ్ఞప్తితో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యారు. ఆమెతో పాటు డింపుల్ కూడా ఈ మూవీతో సిద్ధంగా ఉన్నారు. వరుసగా సంక్రాంతి సీజన్‌లో హిట్ అందుకుంటున్న మీనాక్షి చౌదరి ఈ సారి అనగనగా ఒక రాజుతో హాయ్ చెప్పబోతున్నారు. ప్రమోషన్ల విషయంలో ముందుంటున్నారు నిధి అగర్వాల్. లాస్ట్ ఇయర్ హరిహరవీరమల్లుతోనే కాదు, ఈ ఏడాది ది రాజాసాబ్‌తోనూ ఫిదా చేయడానికి నేను రెడీ అంటున్నారు. ఈ సినిమా త్రూ మాళవిక మోహనన్, రిద్ది కూడా తెలుగులో హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మన శంకర వరప్రసాద్‌గారుతో నయన్ అండ్ కేథరిన్, నారీ నారీ నడుమ మురారితో సంయుక్త మీనన్, సాక్షి వైద్య లైన్లో ఉన్నారు పరాశక్తి సినిమాతో శ్రీలీల కూడా రేసులో ఉన్నారు. వీరందరికీ ఇప్పుడు అర్జంటుగా ఓ హిట్ కావాల్సిందే సో ఈ సంక్రాంతి హీరోలకే కాదు, హీరోయిన్లకు కూడా హిట్ సౌండ్ మస్ట్ అన్నమాట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
Ram Charan: రామ్ చరణ్‌కు కోపం తెప్పించిన స్టార్ డైరెక్టర్
Sai Pallavi: సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూకి అడ్డుగా అమీర్ ఖాన్
అప్పుడు భర్త.. రీసెంట్‌గా భార్య.. సందీప్‌కు దెబ్బ మీద దెబ్బ.. అయినా హిట్ కొట్టాడు
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

