Hindu Mythology: ఆర్ధిక ఇబ్బందులా.. శివయ్యకు ఈ పువ్వు, కాయతో పూజ చేస్తే లక్ మీ సొంతం..

జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కో పువ్వుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. వీటిలో ఒకటి ఉమ్మెత్త  పువ్వు.  ఈ ఉమ్మెత్త పువ్వు త్రిమూర్తుల్లో ఒకరు లయకారుడు శివుడికి అత్యంత ఇష్టమైన పువ్వు. మహాదేవునికి ఉమ్మెత్త పుష్పాన్ని సమర్పించకుండా చేసే పూజ సంపూర్ణం కాదు. ఈ పువ్వు ప్రత్యేకత ఏమిటంటే,

Hindu Mythology: ఆర్ధిక ఇబ్బందులా.. శివయ్యకు ఈ పువ్వు, కాయతో పూజ చేస్తే లక్ మీ సొంతం..
Datura Flower Lord Shiva
Follow us

|

Updated on: May 16, 2023 | 10:53 AM

హిందూమతంలో లక్షలాది దేవుళ్లు ఉన్నారు. ప్రతి దేవతకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి దేవతకు వివిధ వస్తువులు, ఆభరణాలు, ఆయుధాలున్నాయి. అదేవిధంగా ఒకొక్క దేవుడికి ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకమైన రోజు, పువ్వు, పూజ విధానం ఉంది. దేవుళ్ళకు ఏ పువ్వులు ఇష్టం.. ఏ పువ్వుతో పూజ చేయాలనే విషయాలను పురాణాల్లో పేర్కొన్నారు. జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కో పువ్వుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. వీటిలో ఒకటి ఉమ్మెత్త  పువ్వు.  ఈ ఉమ్మెత్త పువ్వు త్రిమూర్తుల్లో ఒకరు లయకారుడు శివుడికి అత్యంత ఇష్టమైన పువ్వు. మహాదేవునికి ఉమ్మెత్త పుష్పాన్ని సమర్పించకుండా చేసే పూజ సంపూర్ణం కాదు. ఈ పువ్వు ప్రత్యేకత ఏమిటంటే, ఈ చెట్టు  ఏ ప్రదేశంలోనైనా చాలా సులభంగా పెరుగుతుంది. ఈ పండు విషపూరితమైనది.

ఈ ఉమ్మెత్త పువ్వుని, ఉమ్మెత్త కాయను ప్రసాదంగా తీసుకోరాదు. విషపూరితమైనప్పటికి.. ఉమ్మెత్త కాయ  చాలా ప్రయోజనాలను, ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఉమ్మెత్త కాయ లాగే.. ఉమ్మెత్త పువ్వుకు కూడా చాలా ప్రత్యేకమైనది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ పువ్వుకు విశేష ప్రాధాన్యత ఉంది.

ఉమ్మెత్త పువ్వు ఎలా ఉంటుందంటే?

ఇవి కూడా చదవండి

ఉమ్మెత్త పువ్వు రంగులో రంగులున్నాయి. అయితే ఎక్కువగా తెల్ల ఉమ్మెత్త పువ్వు అందుబాటులో  ఉంటుంది. శివయ్యకు ఈ రంగు చాలా ఇష్టం. ఉమ్మెత్త పువ్వులకు సువాసన ఉండదు. కొన్ని ప్రదేశాలలో ఈ పువ్వు లేత ఊదా లేదా పసుపు రంగులో కనిపిస్తుంది. ఈ పువ్వును కోసిన వెంటనే వాడిపోతుంది. కావున వెంటనే దేవుడికి సమర్పించాలి.

 ఉమ్మెత్త కాయ, పువ్వు మహాదేవునికి ఎందుకు ప్రియమైనవి?

పాల సముద్రాన్ని అమృతం కోసం మధిస్తున్న సమాయంలో సముద్ర గర్భం నుంచి విషంతో నిండిన కుండ బయటకు వచ్చింది. ఆ సమయంలో దేవతలందరూ ఈ విషాన్ని ఎవరు తాగుతారు అని ఆలోచించడం మొదలుపెట్టారు. లోక కళ్యాణం కోసం శివుడు ఆ విషాన్ని తీసుకుని తన గొంతులో భద్రపరుచుకున్నాడు. దీని కారణంగా విషపూరితమైన ఉమ్మెత్త కాయను , పువ్వులను శివయ్యకు సమర్పిస్తారు.

ఉమ్మెత్త కాయ విషపూరితమైనందున దీనిని మహాదేవుని ప్రసాదంగా తీసుకోవడం సాధ్యం కాదు. అయితే  మహాదేవుని పాదాల చెంత ఉంచిన ఒక ఉమ్మెత్త పువ్వుని ఖచ్చితంగా మీ వద్ద ఉంచుకోవచ్చు. ఇలా చేయడం వలన మహాదేవుని ఆశీస్సులు నిలిచి ఉంటాయి.

ఉమ్మెత్త పువ్వుతో ఏమి చేయాలి?

– మీరు మీ పుస్తకాలలో ఉమ్మెత్త పువ్వును ఉంచవచ్చు. ఈ పువ్వు ఎండిపోయినా పుస్తకంలో ఉంచవచ్చు. ఇది జ్ఞానాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది.

– మీరు మీ డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఉమ్మెత్త పువ్వును ఉంచుకోవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండటానికి సహాయపడుతుంది.

– నిద్రపోయిన తర్వాత భయంకరమైన కలలు వస్తుంటే.. మీరు నిద్రిస్తున్న దిండు కింద ఉమ్మెత్త పువ్వుని పెట్టుకుని నిద్రించండి. దీంతో భయం తొలగిపోతుంది.

– మీరు వాడిన పువ్వును విసిరేయాలనుకుంటే.. దానిని ఎక్కడపడితే అక్కడ విసిరేయకండి. పవిత్ర నది ప్రవాహంలో వేయండి.

ఉమ్మెత్త పండు విషపూరితమైనప్పటికీ.. మహాదేవునికి ఇష్టం. ఈ సృష్టిలో సమాజం తిరస్కరించిన ప్రతి జీవికీ మహాదేవుడు తన దగ్గర స్థానం కల్పించాడు. కనుకనే శివుడిని భోళాశంకరుడు అని పిలుస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..