AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Squirrel Hanuman: అక్కడ ఉడుత రూపంలో హనుమంతుడు.. ప్రపంచంలో ఏకైక ఆలయం .. 41 రోజూ పూజిస్తే కష్టాలు తొలగుతాయని విశ్వాసం

హనుమంతుడికి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అయితే హనుమంతుడు నిల్చున్నా, కూర్చున్నా.. ఏ భంగిమలో ఉన్నా వానర రూపంలో ఉన్న విగ్రహాన్ని చూసి ఉంటారు. పూజిస్తారు. అయితే హనుమంతుడు ఉడుత రూపంలో పూజలను అందుకుంటున్న ఆలయం ఒకటి ఉందని మీకు తెలుసా..

Squirrel Hanuman: అక్కడ ఉడుత రూపంలో హనుమంతుడు.. ప్రపంచంలో ఏకైక ఆలయం .. 41 రోజూ పూజిస్తే కష్టాలు తొలగుతాయని విశ్వాసం
Hanuman Squirrel Temple
Surya Kala
|

Updated on: May 15, 2023 | 10:36 AM

Share

రామాయణంలో ప్రముఖ పాత్ర హనుమంతుడు. రామ భక్తుడు సాధు రక్షకుడు, దుష్ట శిక్షకుడుగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్దలతో కొలుస్తారు. చిరంజీవిగా కలియుగంలో పూజలను అందుకునే హనుమంతుడికి మనదేశంలో గుడి లేని ఊరు.. విగ్రహం లేని గ్రామం అరుదని చెప్పవచ్చు. ఆంజనేయుడు, హనుమంతుడు, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి అనేక పేర్లతో పూజలను అందుకుంటున్న   హనుమంతుడికి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. హనుమంతుడు నిల్చున్నా, కూర్చున్నా.. ఏ భంగిమలో ఉన్నా వానర రూపంలో ఉన్న విగ్రహాన్ని చూసి ఉంటారు. పూజిస్తారు. అయితే హనుమంతుడు ఉడుత రూపంలో పూజలను అందుకుంటున్న ఆలయం ఒకటి ఉందని మీకు తెలుసా.. అవును అలీఘర్‌లోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయంలో హనుమంతుడు ఉడుత రూపంలో ఉంటాడు. ఈ ఆలయాలను సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ రోజు గిల్హరాజ్ హనుమాన్ దేవాలయం గురించి తెలుసుకుందాం..

ఉడుత హనుమాన్ దేవాలయం ఎక్కడ ఉందంటే భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందిన అలీఘర్‌లోని అచల్ సరోవర్ ఒడ్డున హనుమంతుడి ఆలయం నిర్మించబడింది. వాస్తవానికి.. ఇక్కడ విగ్రహం ఉన్నదనే విషయాన్ని సాధువు గిల్హారాజ్ శ్రీ మహేంద్రనాథ్ యోగి జీ మహారాజ్’ కనుగొన్నారు. ఈ ఆలయంలో.. శ్రీ కృష్ణుడి సోదరుడు బలరాముడు పూజలు చేసినట్లు స్థానికులు కథనం. అంటే ఈ ఆలయం కొన్ని వందల ఏళ్ళు చరిత్ర కలిగిందని చెబుతున్నారు.

ఉడుత రూపంలో హనుమంతుడు 

ఇవి కూడా చదవండి

శ్రీ మహేంద్రనాథ్ యోగి జీ మహారాజ్ కలలో ఒకాసారి హనుమంతుడు కనిపించాడని చెబుతారు. ఈ కలలో, యోగి ఉడుత రూపంలో ఉన్న హనుమంతుడిని పూజించాడు. అనంతరం ఇక్కడ ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో ఉన్న విగ్రహం హనుమంతుడి కన్ను కనిపిస్తుంది. ఇలాంటి  ఏకైక ఆలయం ఉడుత హనుమాన ఆలయం అని భక్తుల నమ్మకం.

దర్శనంతోనే కష్టాలను చూసే ఉడుత హనుమాన్..  వాస్తవానికి ఎక్కడైనా సరే.. హనుమంతుడి పూజిస్తే ఆ భక్తుల కష్టాలు తొలగి.. హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం.. అయితే ఈ ఉడుత హనుమాన్ దేవాలయం కొంచెం ప్రత్యేకం. ఈ ఆలయంలో 41 రోజుల పాటు పూజలు చేసిన వారికి అన్ని కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ ఆలయంలో ప్రతిరోజూ చాలా మంది భక్తులు బజరంగబలికి రకరకాల పదార్ధాలతో నైవేద్యం పెడతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).