Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటలు సమయం..

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత మూడు రోజులుగా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. వీకెండ్ కావడం.. పరీక్ష ఫలితాలు రావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటలు సమయం..
Rush At Tirumala
Follow us

|

Updated on: May 15, 2023 | 9:49 AM

కలియుగ ప్రత్యెక్షదైవం కొలువైన తిరుమల క్షేత్రంలో భక్తకోటి బారులు తీరుతోంది. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు భక్తులు. సహజంగానే వెంకన్న దర్శనం కోసం వెళ్లే భక్తులు అధికంగా ఉంటారు.. ఇప్పుడు వేసవి సెలవులతో పాటు.. పది, ఇంటర్మీడియట్ ఫలితాలు రావడం, ఉద్యోగులకు వరుస సెలవులు అవ్వడంతో స్వామివారి దర్శనం కోసం తిరుమల కొండకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఏడుకొండల వాడిని దర్శించుకుని.. తమ మొక్కులు తీర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లతో పాటు దేశ, విదేశాల నుంచి భారీగా జనం తిరుమలకు తరలివస్తున్నారు. భారీగా భక్తులు క్యూలైన్‌లో నిలుచుని దైవ దర్శనానికి ఎదురుచూస్తున్నారు.

సుమారు 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని సుమారు 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం స్వామివారి దర్శనం కోసం టోకెన్లు లేకుండా క్యూ లైన్‌లో ఎదురుచూస్తున్న భక్తులకు సుమారు పద్దెనిమిది గంటలు పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. సర్వ దర్శనం క్యూలైన్ లో ఉన్న టోకెన్ లేని భక్తులు సంయమనం పాటించాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

ఆదివారం మే 14 వ తేదీన స్వామి వారిని 87 వేల 22 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 36 వేల 187 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామి వారి హుండీ ఆదాయం 3, కోట్ల40లక్షల రూపాయలు. ఈ ఉదయం స్వామివారి దర్శనం కోసం భక్తులు 17 కంపార్ట్ మెంట్లలో ఎదురు చూస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..