లక్ష్మీదేవి అనుగ్రహం కోసం.. శుక్రవారం రోజు తప్పక చేయాల్సిన పనులివే!

Samatha

30 December 2025

శుక్ర వారం రోజున శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈయన రాజ స్వభావం కలిగి ఉంటాడు. ఇక శుక్ర గ్రహం సంపద, ప్రేమ, ఆనందం, విలాసానికి ప్రతీక.

ఇక ఎవరి జాతకంలో అయితే శుక్రుడు శుభ స్థానంలో ఉంటాడో, వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి, సంపదకు, ధనధాన్యానికి లోటు ఉండదు అంటారు.

అయితే శుక్రవారం రోజున శుక్రుడి, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఇంటిలో సంపద వృద్ధి చెందాలి అంటే తప్పకుండా ఈ పరిహారాలు పాటిచాలంట. అవి ఏవంటే?

శుక్ర వారం ఉదయాన్నే నిద్రలేచి, శుభ్రమైన దుస్తులు ధరించి, లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే ఆమెకు తామర పువ్వు సమర్పించడం మంచిది.

అలాగే, శుక్ర వారం రోజున పెళ్లికాని అమ్మాయిలను ఇంటికి ఆహ్వానించి, వారికి బియ్యం పాయసం వడ్డించడం చాలా మంచిది.

ఇక ఎవరైతే శుక్రవారం రోజున ఏదైనా ముఖ్యమైన పని లేదా, ఉద్యోగ కోసం వెళితే కొద్దిగా స్వీట్ పెరుగు తిని వెళ్లడం మంచిది.

అదే విధంగా భార్య భర్తల మధ్య నిరంతరం గొడవలు జరుగుతుంటే, శుక్రవారం రోజు పడకగదిలో జత పక్షుల చిత్ర పటం పెట్టుకోవడం మంచిది.

అలాగే పనులో అడ్డంకులు తొలిగిపోయి, ఇంటిలో సంపద పెరగాలి అంటే శుక్రవారం నల్ల చీమలకు చక్కెర వేయడం చాలా మంచిదంట.