- Telugu News Photo Gallery Inspite of hard work you are not getting success then follow these tips of chanakya
Chanakya Niti: కష్టపడినా విజయం దక్కడడంలేదా.. చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి..
ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త. అతడు చెప్పిన విధానాలను మానవ జీవితానికి అనుసరణీయం అని పెద్దల విశ్వాసం. మనిషి విజయాలను మాత్రమే కాదు.. వైఫల్యానికి కారణాలకు కొన్ని ప్రధాన అంశాలను గురించి చెప్పాడు. అవి ఏంటో తెలుసుకుందాం.
Updated on: May 18, 2023 | 12:36 PM

కృషి- దృఢ సంకల్పం లేకపోవడం: నిరంతర ప్రయత్నాలు చేసే వారికి విజయం వస్తుందని చాణక్యుడు నమ్మాడు. కష్టపడి, పట్టుదలతో పనిచేయాలనే సంకల్పం లేని వ్యక్తులు తమ లక్ష్యాలను ఎప్పటికీ సాధించలేరని ఆయన ఉద్ఘాటించారు. శ్రమతో పాటు లక్ష్యాన్ని సాధించే సంకల్ప బలంగా ఉండాలని, అప్పుడే వ్యక్తి విజయం సాధించగలడని చాణక్య చెప్పాడు.

మద్దతు, ప్రోత్సాహం: ఆచార్య చాణక్య ప్రకారం వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు మద్దతుగా నిలవాలి. వీరి మధ్య సంబంధం బలపడుతుంది. వ్యక్తిగత లక్ష్యాలు, ఆకాంక్షలను కొనసాగించడంలో జీవిత భాగస్వామి మద్దతు ప్రేరణ, ప్రోత్సాహం ఇస్తుంది. ఒకరు విజయం సాధిస్తే.. ఇద్దరూ కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి.

తాదాత్మ్యం, అవగాహన: జీవిత భాగస్వామి భావాలను, అనుభవాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా భార్యాభర్తల మధ్య అవగాహనను పెంపొందించుకోండి. సవాలు ఎదురైతే జీవిత భాగస్వామి మద్దతుగా నిలబడండి. ఇది బంధాన్ని బలపరుస్తుంది. అవగాహన కూడా పెరుగుతుంది.

సహనం, క్షమాపణ: వివాహ బంధంలో సహనం, క్షమాపణ గుణం అతిముఖ్యం. ఈ గుణాలు ఎటువంటి భార్యాభర్తల మధ్య సంబంధాలను కూడా మెరుగుపరిచే గొప్ప గుణం. జీవిత భాగస్వామిలోని లోపాలను ఎత్తిచూపకుండా.. ఓపికపట్టండి .. తప్పు జరిగినప్పుడు క్షమించండి. మనోవేదనలను విడిచి పెట్టండి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధం బలపడుతుంది.

విధి నిర్వహణ: తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని వీడి వెనక్కివెళ్లకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లల పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలా చేయని తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా తమ కర్తవ్యానికి దూరమవుతారు.





























