- Telugu News Photo Gallery Healthy Heart Diet: Heart patients should follow this diet chart to loose weight
Heart Patients Diet: ఈ ఆహారాలు గుండె ఆరోగ్యానికి విషంతో సమానం.. మర్చిపోయికూడా తీసుకోకండి
అధిక బరువు అన్ని రకాలుగా అనర్ధదాయకమే. శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువగా చేరిన కొవ్వు వివిధ వ్యాధులకు కారణం అవుతుంది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే ఠంచన్‌గా బరువు అదుపులో ఉంచుకోవాలి..
Updated on: Aug 20, 2024 | 1:03 PM

అధిక బరువు అన్ని రకాలుగా అనర్ధదాయకమే. శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువగా చేరిన కొవ్వు వివిధ వ్యాధులకు కారణం అవుతుంది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే ఠంచన్‌గా బరువు అదుపులో ఉంచుకోవాలి.

బరువు పెరిగే కొద్దీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి గుండె జబ్బుతో బాధపడేవారు బరువు తగ్గడం మరింత అవసరం. అదే ఒకసారి హార్ట్ ఎటాక్ వచ్చిన తర్వాత బరువు తగ్గడం చాలా కష్టం. అధిక బరువు ఇటువంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే ఇప్పటికే మీకు గుండె సమస్యలు ఉంటే సులువుగా బరువు తగ్గించే ప్రక్రియను చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

గుండె జబ్బులు బరువు తగ్గాలంటే మరింత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అందుకు డైట్ ఆ టచ్ కావాలి. కార్బోహైడ్రేట్లు, అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు, గుండె రోగులకు విషంతో సమానం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రోజువారీ ఆహార జాబితాలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, తక్కువ GI ఉన్న ఆహారాలు చేర్చుకోవాలి. ఈ రకమైన ఆహారం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు బరువు నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది.

ఆహారంలో యాపిల్స్, ఆరెంజ్, లెంటిల్స్, బ్రౌకోలీ, గ్రీన్ వెజిటేబుల్స్, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలను చేర్చుకోవచ్చు.

అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఫలితంగా గుండె జబ్బులతో పాటు మధుమేహం, కొలెస్ట్రాల్ ముప్పు కూడా తగ్గుతుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.




