సీనియర్ వైద్యుడు డా. అజయ్ కుమార్ మాట్లాడుతూ.. తలపై నేరుగా చల్లటి నీటిని పోయడం వల్ల సెరిబ్రల్ పాల్సీ ప్రమాదం పెరుగుతుంది. దీనికి కారణం నేరుగా తలపై చల్లటి నీటిని పోసుకున్నప్పుడు మెదడులోని నరాలు ఒక్కసారిగా కుంచించుకుపోవడం వల్ల రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. అంతేకాకుండా చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గుతుంది. దీని వల్ల శరీరంలో బలహీనత, అలసట, తలతిరగడం, గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు తలెత్తుతాయి.