Makeup Tips: మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే ఈ టిప్స్‌ ఫాలో అవ్వాల్సిందే

అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని అమ్మాయిలు రకరకాల మేకప్ లు ట్రై చేస్తుంటారు. ఇక పండగలు, ఫంక్షన్లు అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గంటల కొద్దీ అద్దం ముందు కూర్చుని సింగారించుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సార్లు చేసే చిన్న చిన్న పొరబాట్ల వాల్ల మేకప్ అంత పర్ ఫెక్ట్ గా రాదు. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ కింది టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు..

Srilakshmi C

|

Updated on: Jan 09, 2025 | 3:07 PM

అమ్మాయిలు అందం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారన్న సంగతి తెలిసిందే. ఇక పండుగలు, శుభకార్యాల్లో అమ్మాయిలు మేకప్ లేకుండా బయటకు అస్సలురారు. అందంగా కనిపించాలని రకరకాల మేకప్‌లను ప్రయత్నిస్తుంటారు. అయితే సహజంగా, అందంగా కనిపించాలంటే కొన్ని టిప్స్‌ చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
మేకప్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. సహజమైన మేకప్ కోసం ముఖాన్ని శుభ్రపరచడం, మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోవద్దు. మేకప్ ఎక్కువసేపు ఉండేందుకు ప్రైమర్ సహాయపడుతుంది. సహజమైన మేకప్ లుక్ కోసం మాయిశ్చరైజర్ తర్వాత ప్రైమర్‌ని అప్లై చేయాలి. ఇది చర్మాన్ని మృదువుగా చేసి మేకప్ లుక్‌ని రెట్టింపు చేస్తుంది.

2 / 5
మాయిశ్చరైజర్, ప్రైమర్ ఉపయోగించిన తర్వాత మాత్రమే మీ చర్మం స్వభావం ఆధారంగా క్రీమ్ ఉపయోగించాలి. మీ చర్మం కాస్త బిగుతుగా ఉంటే BB క్రీమ్‌ని ప్రయత్నించాలి. చేతి లేదా మేకప్ బ్రష్ సహాయంతో చర్మంపై అప్లై చేయవచ్చు. కొంతమందికి ముఖంపై మొటిమల మచ్చలు ఉంటాయి. ఈ మచ్చలు, నల్లటి వలయాలను దాచడానికి కన్సీలర్ సహాయపడుతుంది. కన్సీలర్‌ను అప్లై చేసి, బ్రష్ లేదా స్పాంజ్‌తో వృత్తాకారలో ముఖంపై అప్లై చేయాలి.

3 / 5
పై దశలను పూర్తి చేసిన తర్వాత, సెట్టింగ్ పౌడర్‌తో ముఖాన్ని సెట్ చేయాలి. పౌడర్‌ను మొత్తం ముఖమంతా సమానంగా అప్లై చేసి సెట్ చేయడం చాలా ముఖ్యం. సెట్టింగ్ కాస్త డిఫరెంట్ గా ఉన్నా మేకప్ పర్ఫెక్ట్ గా రాదు.

4 / 5
బ్లష్, హైలైటర్ లేకుంటే మేకప్ అసంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి పౌడర్‌ తర్వాత ఈ ప్రాంతాలను ముక్కుపై, కనుబొమ్మల కింద, పెదవులపై హైలైటర్‌తో హైలైట్ చేయడం మర్చిపోకండి. ఇది మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఆ తర్వాత ఐషాడో, కళ్ల కింద, మస్కారా అప్లై చేయడం వల్ల ఐ మేకప్ పూర్తవుతుంది. పెదవులపై లిప్ బామ్ అప్లై చేయాలి. అలాగే సహజమైన పెదవి రంగు, లేత రంగు లిప్‌స్టిక్‌కి సరిపోయే లిప్ లైనర్‌ని ఉపయోగించాలి. ఇది సహజమైన మేకప్ లుక్‌ ఇస్తుంది.

5 / 5
Follow us