ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దాం అంటున్న కోలీవుడ్ స్టార్స్!
ఎప్పుడు ఒకేలా ఉంటే ఏం బాగుంటుంది అనుకున్నారేమో మన కోలీవుడ్ స్టార్స్. కాస్త కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటూ.. ఒకరికి ఒకరు సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు మన హీరోస్. ధనుష్, సూర్య, శివకార్తికేయన్ వీరే కాకుండా సీనియర్ హీరోలు సైతం కాస్త డిఫరెంట్‌గా ఉండే పాత్రలనే చేయడానికి ఇష్టపడుతున్నారంట.
Updated on: Jan 09, 2025 | 3:09 PM

ఒక సినిమాకు మరో సినిమాకు ఏ మాత్రం సంబంధం లేకుండా ప్లాన్ చేస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరోలు. ప్రజెంట్ మంచి ఫామ్‌లో ఉన్న ధనుష్, శివ కార్తికేయన్, సూర్య, విక్రమ్ ఇలా ప్రతీ హీరో ఒక్కో సినిమాకు సంబంధం లేకుండా ప్లాన్ చేస్తున్నారు.

రీసెంట్‌గా రాయన్‌తో సూపర్ హిట్ అందుకున్న ధనుష్, నెక్ట్స్ మూవీని కూడా ఓన్ డైరెక్షన్‌లోనే చేస్తున్నారు. ఇడ్లీ కడై పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న కుబేరలో కూడా డిఫరెంట్ మేకోవర్‌తో దర్శనమివ్వబోతున్నారు ధనుష్.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న శివ కార్తికేయన్ కూడా ధనుష్‌నే ఫాలో అవుతున్నారు. రీసెంట్‌గా అమరన్‌తో ఆర్మీ ఆఫీసర్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరో, నెక్ట్స్ మూవీని పీరియాడిక్ జానర్‌లో ట్రై చేస్తున్నారు. 1965లో జరిగే కథ కావటంతో అందుకు తగ్గట్టుగా మేకోవర్ అవుతున్నారు.

సీనియర్ హీరోలు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కంగువాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించిన సూర్య, రెట్రోలో వింటేజ్ గెటప్ ట్రై చేశారు. ఆ తరువాత తెరకెక్కబోయే వాడివాసల్ పల్లెటూరి యువకుడిగా కనిపించబోతున్నారు.

పొన్నియిన్ సెల్వన్‌లో హిస్టరిక్ రోల్‌లో కనిపించిన విక్రమ్, తరువాత తంగలాన్‌లో మరో డిఫరెంట్ గెటప్ ట్రై చేశారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న వీర ధీర సూరన్‌లో మరో డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నారు.





























