- Telugu News Photo Gallery Cinema photos Actress Surekha Vani And Daughter Supritha Visit Tirumala Srivari Temple, See Photos
Surekha Vani: కూతురితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్ ఇదిగో
టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖా వాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో సహాయక నటి పాత్రల్లో అద్భుతంగా యాక్ట్ చేసిందామె. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సురేఖా వాణి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.
Updated on: Jan 09, 2025 | 3:39 PM

టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖ వాణి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ( జనవరి 09) ఉదయం కూతురు సుప్రియతో కలిసి తిరుమల చేరుకున్న ఆమె శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

దర్శనానంతరం తిరుమల ఆలయం ఎదుట కలిసి ఫొటోలు దిగారు తల్లీ కూతుళ్లు. ఈ సందర్భంగా భక్తులు కూడా వారితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.

తమ తిరుమల పర్యటకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్నారు సురేఖా వాణి, సుప్రితల దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి

అంతకు ముందు కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారీ తల్లీ కూతుళ్లు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంది సుప్రిత.

కాగా సురేఖ వాణి గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె కూతురు వెండితెరకు పరిచయం కాబోతుంది.

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ రన్నరప్ అమర్ దీప్ హీరోగా నటిస్తోన్న ఓ చిత్రంలో సుప్రిత హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.





























