భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో MSMEల సహకారం కూడా పెరిగింది. 2017-18లో 29.7% ఉండగా, 2022-23లో 30.1%కి పెరిగింది. గ్రామీణ భారతంలో వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరిన్ని రుణాలు అందించడంపై దృష్టి సారిస్తోందని నాగరాజు తెలిపారు. భారతదేశ అభివృద్ధికి, నాణ్యత, ఎగుమతులకు మెరుగైన కనెక్టివిటీ, సామర్థ్య పెంపుదల, అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పాటు అనే నాలుగు అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.