మీ ఫ్రిజ్ దుర్వాసన వస్తుందా.. ఈ చిట్కా ట్రై చేయండి!

09 January 2025

samatha

మన ఇంట్లో ఉండే ఫ్రిజ్ అప్పుడప్పుడు దుర్వాసన రావడం అనేది చాలా కామన్. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, స్మెల్ వస్తుంటది.

అయితే ఫ్రిజ్ నుంచి వచ్చే స్మెల్‌ను పొగొట్టడానికి చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎంత చేసినా సమస్య మాత్రం అలాగే ఉంటుంది.

కానీ ఈ చిన్న చిట్కాతో మీ ఫ్రిజ్ చాలా తాజాగా ఫ్రెష్ స్మెల్‌తో ఉంటుందంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ చిట్కా ఏమిటంటే?

నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే. ఇది వైరస్, బ్యాక్టీరియాలను దూరంగా ఉంచుతుంది.

అయితే  నిమ్మకాయ ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, ఫ్రిజ్ లోని దుర్వాసనను కూడా పొగొడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

 అంతే కాకుండా ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారపదార్థాలను తాజాగా ఉంచడంలోను కూడా నిమ్మకాయ కీలక పాత్ర పోషిస్తుందంట.

 నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి అందు వలన ఇది మన ఫ్రిజ్‌లో ఉండే వైరస్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అయితే ఈ నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలంట. దీని వలన ఆహార పదార్థాలు తాజాగ ఉండటమే కాకుండా దుర్వాసన కూడా పోతుంది.