పుట్టిన ప్రతి ఒక్కరికీ ఇప్పుడు ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. మన భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తికి ఆధార్ అనేది ఉంటుంది.
మనకు ప్రభుత్వం పరంగా ఏ పని చేసుకోవాలన్నా, ఏవైనా పథకాలకు అర్హులు కావాలంటే అధికారులు తప్పనిసరిగా ఆధార్ కార్డును అడుగుతుంటారు.
అయితే మన దగ్గర ఉండే ఆధార్ కార్డులో మన ఫోటో చూడటానికి చాలా దారుణంగా ఉంటుంది. అందుకే దానిని చూడాలంటేనే చాలా మంది భయపడి పోతుంటారు.
ఎందుకంటే అంత ఘోరంగా ఆధార్‌లో ఫోటో ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆధార్ కార్డులో ఫోటో ఎందుకు అలా ఉంటుందో.
ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం. మన దగ్గర ఉండే ఆధార్‌ను ప్రభుత్వ ఆఫీసుల్లో క్రియేట్ చేస్తారు. అయితే వారు వాడే కెమెరా క్వాలిటీ అస్సలే బాగుండదంట.
అంతే కాకుండా, మన ఆధార్ కోసం ఫోటో తీసుకునే ఆఫీసులలో లైటింగ్ సరిగా ఉండకపోవడం, వారు ఏదో తీసామా అంటే తీసాము అనేలా తీయడం.
ముఖ్యంగా ఫోటోను డిజిటల్‌గా అప్లోడ్ చేయడం, అదే విధంగా మన ఫోటోను కార్డుపై ముద్రించే సమయంలో క్వాలిటీగా ఉందో చెక్ చేయరంట.
క్వాలిటీ కరెక్ట్‌గా ఉండకపోవడం,ఫోటోను ప్రింట్ చేసే సమయంలో కూడా క్వాలిటీని అధికారులు పట్టించుకోకపోవడం వంటి వాటి వల్ల మన ఆధార్‌లో ఫోటో సరిగా ఉండదంట.