05January 2025

నిమ్మకాయే కాదండోయ్.. తొక్కలతో కూడా బోలెడు లాభాలు!

TV9 Telugu

నిమ్మకాయతో చాలా ఉపయోగాలు ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ నిమ్మకాయ తొక్కతో కూడా బోలెడు లాభాలు ఉన్నాయంట.

మనం ఎన్నో రకాల వంటలు, పులిహోర, మాంసాహారంలో నిమ్మకాయను ఉపయోగిస్తాం. కానీ తొక్కను మాత్రం పక్కన పారేస్తుంటారు.

అయితే మనం పక్కన పారేసే ఈ నిమ్మకాయ తొక్కలో అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఉన్నాయంట.

మన చర్మానికి, కురులకు, ఆరోగ్యానికి ఈ నిమ్మకాయ తొక్కలు ఎంతగానో పని చేస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

నిమ్మ తొక్కలను ఎండల ఎండబెట్టి, వాటిని మిక్సీ పట్టి పౌడర్‌లో చేసుకొని, ప్రతి రోజూ ఈ పౌడర్‌ను ముఖం, చర్మంపై రాయడం వలన చర్మం నిగారింపుగా కనిపిస్తుంది.

అదే విధంగా  మీరు జలుబు లేదా దగ్గు సమస్యతో బాధపడుతుంటే, ఈ నిమ్మకాయ తొక్కలను టీలో వేసుకొని తాగడం వలన కాస్త ఉపశమనం లభిస్తుందంట.

అలాగే నిమ్మకాయ తొక్కలను వేడి నీటిలో మరగబెట్టి ఆ నీటిని వారంలో రెండు సార్లు జుట్టుకు పట్టించడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

అంతే కాకుండా ఈ నిమ్మ తొక్కలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయంట.