మనీ ప్లాంట్ దొంగతనం చేయడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారంటే?
TV9 Telugu
చెట్లు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. చాలా మంది చెట్లను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. రకరకాల మొక్కలను ఇంటి ఆవరణంలో నాటి వాటిని చూస్తూ ఆనంద పడతారు.
ఇక పూల మొక్కలతో పాటు చాలా మంది తమ ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటారు.అయితే ఇలా మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంటికి అందమే కాకుండా అదృష్టం వస్తుందంటారు
దీంతో కొంత మంది ఈ మొక్కను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చుకుంటే, ఇంకొందరు మాత్రం దొంగతనం కూడా చేస్తుంటారు.
అయితే ఇలా దొగతనం చేసిన మనీ ప్లాంట్ మన ఇంట్లో పెట్టుకోవడం మంచిదా? కాదా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది.
ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. మనీ ప్లాంట్ దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకోవడం అస్సలే మంచిది కాదు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
ఇతరుల నుంచి మనీప్లాంట్ దొంగిలించి ఇంట్లో పెట్టుకోవడం చాలా పెద్ద తప్పు అంట.దీని వలన అనేక సమస్యలు వస్తాయంట.
మనీ ప్లాంట్ వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని అంటారు కానీ, దొంగలించడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రావడమే కాకుండా ఆర్థిక సమస్యలు వస్తాయంట.
అందుకే వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ దొగతనం చేయకుండా కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీపోయి పాటిజిటివిటి పెరుగుతుందంట.