కొంత మంది అరచేతులు ఎప్పుడూ చల్లగా ఉంటాయి. దీంతో వారు భయపడి పోతుంటారు. ఏంటీ వాతవరణం చల్లగా లేకపోయినా, అర చేతులు ఇంత చల్లగా ఉన్నాయి అని.
అయితే ఇలా అరచేతులు ఎప్పుడూ చల్లగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి అంటున్నారు. ఆరోగ్యనిపులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
రక్తహీనత, హైపోథైరాయిడ్ ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందంట. ఎందకంటే వారి చేతులకు రక్తం సరిగా సరఫరా కాకపోవడం వలన చేతులు చాలా చల్లగా మారిపోతాయి.
ఎవరైతే ఎక్కువగా ఒత్తిడికి లోను అవుతారో వారి అరచేతులు కూడా చాలా చల్లగా ఉంటాయంటున్నారు వైద్యులు. ఎందుకంటే అధిక ఒత్తిడి వలన వారి చేతులలో రక్తప్రసరణ తగ్గిపోయి చల్లగా మారిపోతాయంట.
అంతే కాకుండా మధుమేహం, ఎక్కువ కొలెస్ట్రాల్, ప్యాట్ ఉన్నవారిలో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వలన కూడా వారి అరచేతులు ఎప్పుడూ చల్లగా ఉంటాయంట.
మద్యం సేవించడం, ఎక్కువగా స్మోక్ చేసే వారి అరచేతులే కాకుండా వారి పాదాలు కూడా చల్లగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు
ఎందుకంటే అతిగా మద్యం సేవించడం , స్మోక్ చేయడం వలన రక్తనాళాలు సంకోచించి, అరచేతులకు సరిగా రక్త ప్రసరణ జరగక, చల్లగా ఉంటాయి
అలాగే కొంత మంది ఎక్కువ సమయం చల్లటి ప్రదేశంలో ఉండటానికి ఇష్టపడిపోతుంటారు. అయితే అలా ఎక్కువ సేపు చల్లగా ఉండే వాతావరణంలో ఉండటం వలన కూడా అరచేతులు చల్లగా అవుతాయంట.
అఅయితే ఈ సమస్యతో బాధపడే వారు మంచి పోషకాహారం తీసుకుంటూ, ప్రతి రోజూ వ్యాయామం చేయడం వలన చేతులకు సరిగా రక్తప్రసరణ జరిగి ఈ సమస్య నుంచి బయటపడవచ్చునంట.